భన్సాలీ చిత్రంలో ఐశ్వర్య..? అమ్మగా ఇదే తొలిచిత్రమా?
అందాల తార ఐశ్వర్యరాయ్ ఇటీవలే అందమైన పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రసవించి నెల గడిచిందో లేదో..మళ్లీ సినిమాలపై మనసు పెట్టింది ఐశ్వర్య. మరో నెల రోజుల్లో ఓ సినిమాలో నటించడానికి సన్నద్ధం అవుతోందట. బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ త్వరలో ఐశ్వర్య కథానాయికగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇటీవలే ఐశ్వర్యను కలసిన సంజయ్‌లీలా భన్సాలీ హీరోయిన్ ఓరియెంటడ్ కథ చెప్పినట్లు, ఐశ్వర్య కూడా ఆ సబ్జెక్ట్‌ను ఓకే చేసిందని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కలయికలో 'హమ్ దిల్ దే చుకే సనమ్, దేవ్‌దాస్, గుజారిష్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఓ పాపాయికి జన్మనిచ్చి ఇప్పుడు అమ్మ పోస్టు సొంతం చేసుకున్న ఐశ్వర్యకు బహుషా ఇదే తొలి చిత్రం కావొచ్చని చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదనకు వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్దమనుషులు మాత్రం కనీసం ఓ ఆరు నెలలైనా ఐశ్వర్య తన బిడ్డను తగ్గరుండి చూసుకోవాలని, అప్పుడే తనకు ఆ బిడ్డుక మంచిది అని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











