'మిరపకాయ' హిందీ రీమేక్ ఆ హీరోతో..
తెలుగులో హిట్ అయిన చిన్న, చితక చిత్రాలను కూడా హిందీ వాళ్లు ఒదిలిపెట్టడం లేదు. తాజాగా రవితేజ హిట్ చిత్రం మిరపకాయ హిందీలోకి రీమేక్ కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ హీరోగా చేయటానికి టాక్స్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. అలాగే చిత్రాన్ని మిరపకాయ డైరక్టర్ హరీష్ శంకర్ డైరక్ట్ చేయనున్నారు. ఇక ఇప్పటికే అజయ్ దేవగన్ తెలుగు సూపర్ హిట్ మర్యాద రామన్న రీమేక్ లో బిజీగా ఉన్నారు. మిరపకాయ చిత్రం చూసిన అజయ్ దేవగన్ నచ్చి ఈ చిత్రం డైరక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన దబాంగ్ కిది రీమేక్. శృతిహాసన్ కాంబినేషన్ లో పవన్ చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ పంజా చిత్రం ప్లాప్ కావటంతో ఈ చిత్రం ఎలాగైనా ఆడాల్సిన అవసరం ఉంది. మిరపకాయ చిత్రంలో పంచ్ డైలాగులతో అదరకొట్టిన హరీష్ శంకర్ ఈ చిత్రంలోనూ ఫ్యాన్స్ ఖుషీ చేసే పంచ్ డైలాగులు రాసినట్లు చెప్పుతున్నారు.


Click it and Unblock the Notifications











