కాజల్ వెంటపడుతున్న హీరోగారు..వరస చూస్తుంటే మళ్ళీ మరో సినిమా..?

By Sindhu

తన భార్య పేరు, ఈమె పేరూ ఒకటే అయినందుకు ఇష్టపడుతున్నాడో, లేక ఆమె అందానికి పడిపోయాడో కానీ... బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రస్తుతం మన కాజల్ ని తెగ పొగిడేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి తమిళ హిట్ సినిమా 'సింగం' హిందీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగులో కాజల్ ని విడిచి అజయ్ ఒక్క క్షణం కూడా వుండటం లేదట. ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడికెళ్ళి కూర్చుని ముచ్చట్లాడుతున్నాడట. ఇప్పుడీ సినిమా షూటింగ్ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా కాజల్ తో మరో సినిమా చేయాలని వుందని చెబుతున్నాడు కూడా.

'కాజల్ ఎంత గొప్ప అందగత్తో... అంతకు తగ్గా మంచి నటి. ఆమెతో మరోసారి నటించాలని వుంది' అంటూ ఐశ్వర్యారాయ్ లెవెల్లో ఆమెను పొగిడివదులుతున్నాడు. తను అంతలా పొగిడేస్తుంటే బాగుండదనుకుందేమో... కాజల్ కూడా స్తోత్రం అందుకుంటూ, 'అజయ్ గొప్పనటుడు. మంచి మనిషి. ఆయనతో చేయడమే ఓ అదృష్టం. ఆయన అభిమానం పొందడం మరో అదృష్టం' అంటూ
రిటర్న్ పొగడ్తలిస్తోంది. వరస చూస్తుంటే, కాజల్ కి అజయ్ వెంటనే మరో సినిమా ఇచ్చేలానే వున్నాడు!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X