RC16: మరోసారి RRR హీరోల కాంబినేషన్.. రామ్ చరణ్ ప్లాన్‌కు మైండ్ బ్లాకే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెగా బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరించి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను సాధించిన అతడు.. ఈ మధ్య కాలంలో అయితే ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. అలాగే, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే స్థాయికి కూడా ఎదిగిపోయాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చేశాయి. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. 'గేమ్ చేంజర్' సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది ప్రారంభం కాబోతుంది.
పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు లయను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని, విలన్‌గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని అంటున్నారు. అలాగే, శివ రాజ్‌కుమార్ కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను తీసుకున్నారని తెలిసింది. ఆయన ఈ చిత్రంలో హీరోకు సహాయం చేసే ఓ పాజిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలిసింది. గతంలో RRRలో సైతం అజయ్.. రామ్ చరణ్ పాత్రకు తండ్రిగా నటించారు. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్‌ను చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











