‘ఆర్ఆర్ఆర్’ విషయంలో రాజమౌళి ప్రయత్నాలు ఫలించడం లేదా?

బాహుబలి, బాహుబలి 2 లాంటి భారీ ప్రాజెక్టులతో ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిన రాజమౌళి... జాతీయ స్థాయి డైరెక్టర్ అయ్యారు. ఈనేపథ్యంలో ఆయన నుంచి రాబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను ఓ కీలకపాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. కారణం ఏమిటో తెలియదు కానీ రాజమౌళి ఆఫర్ అజయ్ దేవగన్ రిజెక్ట్ చేసినట్లు టాక్.

అక్షయ్ కుమార్ పేరు కూడా...

అక్షయ్ కుమార్ పేరు కూడా...

అజయ్ దేవగన్‌ నో చెప్పడంతో వెంటనే ‘ఆర్ఆర్ఆర్' మేకర్స్ మరో స్టార్ అక్షయ్ కుమార్‌ను సంప్రదించినట్లు తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఇంతకు ముందు అజయ్ దేవగన్ మీద... కమల్ హాసన్ ‘ఇండియన్ 2'లో అతడిని విలన్ పాత్ర కోసం సంప్రదించారని, అందుకు అతడు ఒప్పుకోలేదనే వార్తలు వినిపించాయి.

బాలీవుడ్ మార్కెట్ ఒడిసిపట్టేందుకు

బాలీవుడ్ మార్కెట్ ఒడిసిపట్టేందుకు

బాలీవుడ్ మార్కెట్ గ్రాబ్ చేయాలంటే హిందీ సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ఒక స్టార్ ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులో భాగం అయితే బావుంటుందని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అయితే చివరకు ఎవరు ఒప్పుకుంటారో? ఫైనల్ అయ్యేది ఎవరో వేచిచూడాల్సిందే.

రూ. 300 కోట్ల బడ్జెట్

రూ. 300 కోట్ల బడ్జెట్

‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ స్థాయి బాహుబలి రేంజికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి ఎలాంటి క్లూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రకరకాల రూమర్స్

రకరకాల రూమర్స్

‘ఆర్ఆర్ఆర్' అంటే... ‘రామ రావణ రాజ్యం' అనే ప్రచారం కూడా ఉంది. ఇది స్వాతంత్ర్య రాక ముందు జరిగిన కథతో సాగుతుందనే రూమర్స్ సైతం తెరపైకి వచ్చాయి. ఎన్టీఆర్ దొంగ పాత్ర చేస్తున్నాడనే వార్తలూ వినపించాయి. అయితే రాజమౌళి అండ్ టీమ్ నుంచి ఇప్పటి వరకు ఈ రూమర్లపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X