RRR.. దానయ్య గట్టిగానే ఇచ్చుకున్నాడట.. ఇక రాజమౌళి ఊరుకుంటాడా మరి!
బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత జక్కన్న చేస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ RRR. బాబుబలి కోసం ఐదేళ్లు కష్టపడిన రాజమౌళి అంతే పకడ్బందీగా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ RRR కోసం కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ప్రకటించబడిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జులై 30కి ఈ సినిమా విడుదల ప్లాన్ చేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న ఓ వార్త టాలీవుడ్ ప్రేక్షకులకు షాకిస్తోంది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి పోతే..

రాజమౌళి లాంటి ఉద్దండుడు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ
సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలంటేనే అదో క్రేజ్. అలాంటిది రాజమౌళి లాంటి ఉద్దండుడు మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారంటే ఇక ఆ సంచలనాలు ఉహించగలమా చెప్పండి. దీనికి తోడు నేటితరం క్రేజీ హీరోలు, అశేష అభిమాన వర్గమున్న యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఒకే తెరపై చూపించనుండటం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెంచేసింది.

భారీ తారాగణం.. బాలీవుడ్ తారలు
రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కాదండోయ్.. అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు జక్కన్న. ప్రస్తుతం భారీ హంగులతో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు రాజమౌళి. ఆయన ఎంచుకున్న భారీ తారాగణానికి నిర్మాత దానయ్య కూడా కోట్లు కుమ్మరిస్తున్నారని టాక్ నడుస్తోంది.

దానయ్య గట్టిగానే ఇచ్చుకున్నాడట
గతంలో ఆలియా భట్ భారీగా పుచ్చుకుంటోందన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజయ్ దేవగన్ రెమ్యునరేషన్ విషయం కూడా బయటకు రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 30 నుంచి 35 కోట్లు తీసుకుంటున్నాడట అజయ్ దేవగన్. అంటే బాలీవుడ్‌లో హీరోగా ఆయన తీసుకుంటున్న పారితోషికానికి ఇది సమానం.

అంతిచ్చుకున్నాక రాజమౌళి ఊరుకుంటాడా మరి
సాధారణముగానే రాజమౌళి దర్శకత్వ పటిమ మాటల్లో చెప్పలేనిది. అలాంటిది బాలీవుడ్‌లో ఇచ్చే రెమ్మ్యూనరేషన్‌కి సమానమైన సొమ్ము దానయ్య చెల్లిస్తుంటే రాజమౌళి ఊరుకుంటాడా మరి!. అజయ్ దేవగన్ నటనా ప్రతిభను మొత్తంగా వాడుకొని టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేస్తాడు అనేది జనం టాక్.

రాజమౌళి ఆలోచనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ సై
ఇక RRR సినిమా కోసమై 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్‌పై రాజమౌళి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు సమాచారం. ఈ టైటిల్ రాజమౌళికి బాగా నచ్చేసిందట. సో ఇదే కన్ఫర్మ్ చేసేద్దామని ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చెప్పినట్లుగా ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. దీనిపై ఆ ఇద్దరు యంగ్ హీరోలు కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.

RRR మూవీపై ఓ రేంజ్ అంచనాలు
దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు కావడంతో RRR పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అలరించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు. ఇటీవలే బల్గెరియాలో షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ లో ఉంది RRR టీమ్.


Click it and Unblock the Notifications











