షారూఖ్ ఖాన్ కి విలన్ గా తెలుగు నటుడు

By Srikanya

హైదరాబాద్: తెలుగు హీరోయిన్స్, హీరోలు బాలీవుడ్ కి వరసగా ప్రయాణం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు చిత్రాల విలన్ అజయ్..బాలీవుడ్ కు వెళ్తున్నట్లు సమాచారం. షారూఖ్ ఖాన్ కొత్త చిత్రం చెన్నై ఎక్సప్రెస్ లో అజయ్ ని విలన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా పదుకోని హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ కామెడీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వరస గోల్ మాల్ సీరిస్ దర్శకుడు రోహిత్ శెట్టి డైరక్ట్ చేయనున్నారు.

ఈ పాత్ర కోసం మొదట తమిళ నటుడు ఆర్య ను అనుకున్నారు కానీ విక్రమార్కుడులో అజయ్ ఫెరఫార్మెన్స్ చూసిన రోహిత్ శెట్టి ఇంప్రెస్ అయ్యి అవకాసం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అజయ్..బ్యాంకాక్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రం ఆంగూర్ రీమేక్ అని తెలుస్తోంది. ఇప్పటికే షారూఖ్ కి లైన్ చెప్పి ఓకే చేయించుకుని స్కిప్టు మీద కూర్చుంటున్నట్లు చెప్తున్నారు. కథల షారూఖ్ ..ముంబై నుంచి రామేశ్వరం కు వెళ్లే వ్యక్తిగా కనిపించనున్నారు.

రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అవుతోంది. ఈ విషయమై రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక..ఎలా చేసినా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు.

అజయ్ విషయానికి వస్తే ...ఎన్టీఆర్ తో బాద్షా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రంలో విలన్ గా అజయ్ చేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న బాద్షా చిత్రం కామెడీ ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం ..అదుర్స్ లా తన అభిమానులను అలరిస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు ఎన్టీఆర్. అజయ్ ఈ చిత్రంతో పాటు మరికొంత మంది స్టార్ల సినిమాల్లో చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X