‘మల్లిక’ ను ప్రేమిస్తే?
నృత్యదర్శకుడిగా ప్రసిద్దుడైన రాజు సుందరం దర్శకత్వం వహించిన తోలి సినిమా కాబట్టి సంగీత పరంగా, నృత్యపరంగా ఈ సినిమా బావుంటుందనుకుంటున్నారు, నయనతారకు తెలుగులో ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పారు. ప్రముఖ నిర్మాత కె.ఎన్ రామారావు, అజిత్, నయనతార, నవదీప్ కాంబినేషన్లో స్నేహాల్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై వాగిచర్చ మురళీకృష్ణ నిర్మిస్తున్న 'మల్లిక" నయనతార అధ్యాపకురాలిగా నటించిన చిత్రం 'మల్లిక .....ఐ లవ్యూ". అజిత్ కథానాయకుడు. ఈ చిత్రానికి రాజు సుందరం దర్శకత్వం వహించారు. నవదీప్ ఈ చిత్రం లో కీలక పాత్రదారి.
నిర్మాత వాగిచర్ల మురళీకృష్ణ మాట్లాడుతూ 'కన్నబిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలని ఓ తండ్రి ఉబలాటపడతాడు. ఆ అత్రుతతో కొన్ని అడ్డదారులూ తొక్కుతాడు. అది తెలుసుకున్న కొడుకులు అతనికి దూరంగా వెళ్లిపోతారు. తర్వాత ఏమైందన్నది అసలు కథ. అనువాద కార్యక్రమలన్నీ పూర్తయ్యాయి. ఈ నెల్లోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి వెన్నెముకగా నిలుస్తుందని, పాటలు అద్భుతంగా వచ్చాయని సహనిర్మాత ప్రసాద్(బోస్) పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











