అఖండ 2 హిట్ కావాలని వేణుస్వామి ప్రత్యేక పూజలు? బాలయ్య కోసం ఆ హోమం!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అఖండ 2. వీరిద్దరి కాంబినేషన్‌ తెరకెక్కిన నాలుగో చిత్రం కావడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 5న అఖండ 2 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా... టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అఖండ తాండవం కోసం బాలయ్య అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

Akhanda 2 Is Venu Swamy Parankusham Performed Special Rituals for Nandamuri Balakrishna s movie

అఖండ 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అఖండ 2కి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు
మరోవైపు.. అఖండ 2 సినిమా కోసం చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ముంబైలో సాంగ్ లాంచ్, కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంతో పాటు ఆడియో ట్రాక్‌ను కూడా రిలీజ్‌కు ముందే తీసుకొచ్చింది. ఇక హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా.. ఆ తర్వాతి నుంచి సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది. అయితే సినిమాకు భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని అఖండ 2 యూనిట్ భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలయ్యకు సెంటిమెంట్లు
తెలుగునాట సెలబ్రిటీలకు ప్రత్యేక పూజలంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. ఈయన జ్యోతిష్యంతో పాటు కామాఖ్య తదితర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. వేణుస్వామితో పూజలు చేయించిన హీరోయిన్లు టాప్ ప్లేస్‌కి వెళ్లడంతో సినీ ప్రముఖులు ఈయన ఇంటి ముందు బారులు తీరుతున్నారు. తాజాగా అఖండ 2 కోసం కూడా వేణుస్వామి ప్రత్యేక పూజలు చేయించినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. స్వతహాగా నందమూరి బాలకృష్ణకు జ్యోతిష్యం, పూజలు, ముహూర్తాలు, శకునాలు వంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అందుకే ఈ విషయాన్ని కొట్టిపారేయడానికి లేదని అంటున్నారు సినీ జనాలు.

నాపై ఎన్నో విమర్శలు చేశారు
అయితే వేణుస్వామి విడుదల చేసిన ఓ వీడియో కూడా ఇందుకు బలం చేకూర్చేలా ఉంది. అందులో వేణుస్వామి ఓ హోమం చేయించిన అనంతరం మాట్లాడుతూ.. ఉదయం నుంచి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తున్నారు. స్వామి నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరం 16 నెలల కిందట నాగచైతన్య - శోభిత వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ.. ఎవరు అడిగారని శోభిత - నాగచైతన్య జాతకాలను బహిర్గతం చేశారని విమర్శించిన వాళ్లు చాలామంది ఉన్నారు అని వేణుస్వామి తెలిపారు.

ఎవరు అడిగారని మైకులు తీస్తున్నారు
చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్లు, ఇవాళ ఉదయం నుంచి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి, మైకులు పట్టుకుని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ల నోళ్లలో మైకులు పెడుతూ.. సమంత జాతకం ఎలా ఉండబోతోంది? మగపిల్లాడు పుడతాడా? ఆడబిడ్డ పుడుతుందా? అదేదో వెరైటీగా పెళ్లి చేసుకుందట సమంత.. భార్యాభర్తలిద్దరూ కలిసుంటారా? విడిపోతారా? ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు? ఎలా ఉంది? అని చాలామంది మైకులు పట్టుకుని జ్యోతిష్యుల నోళ్లలో మైకులు పెట్టి మరి అడుగుతున్నారు. స్వామి మరి మీకు ఏమనిపిస్తోంది? చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్యులు ఏం చేస్తారు? అడిగారు కాబట్టి చెబుతారు. వాడు ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు.. నన్ను అంటే? మరి ఇప్పుడు సమంత అడిగిందా? రాజ్ నిడిమోరు అడిగాడా? మరి వీళ్లెందుకు మైకులు పెట్టి జ్యోతిష్యుల దగ్గరికెళ్లి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు. మీరేమైనా దీనిపై స్పందిస్తారా? అని ఉదయం నుంచి ఫోన్లు చేస్తున్నారు అని వేణుస్వామి వ్యాఖ్యానించారు.

ఆ పెద్ద సినిమా కోసం పూజలు
అమ్మా.. నేను ఆది, సోమ, మంగళవారం ఈ మూడు రోజుల పాటు ఇప్పుడు రిలీజ్ కాబోతోన్న చాలా పెద్ద సినిమా సూపర్‌హిట్ కావాలని, చాలా పెద్ద ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కు సంబంధించిన సినిమా పూజ నిమిత్తం బగళాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించాం. నాకు వీటి పట్టింపుపలు ఏం లేవు, సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా.. చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరొకలాగా చూపిస్తారు. ఒకడిని నాశనం చేయాలనుకుంటే ఒకలాగా.. లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు. వారి గురించి నాకు అనవసరం, నా పనులు నేను చేస్తూ వెళ్లిపోతాను. తిరుమల శ్రీవారి, కామాఖ్య, బగళాముఖీ, చిన్నమస్తా అమ్మవార్లే నన్ను కాపాడతారు అని వేణుస్వామి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వేణుస్వామి చెప్పిన పెద్ద సినిమా అఖండ 2నే అని .. ఈ సినిమా హిట్ కావాలని బగళాముఖీ అమ్మవారి హోమం చేయించారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X