Don't Miss!
- Automobiles
పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..
- Sports
Asia Cup 2022: పాకిస్థాన్ జట్టులో ఆ ముగ్గురు డేంజర్‌గాళ్లు.. రోహిత్ సేన ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలి!
- Finance
Archeology of India: సందర్శన ప్రాంతాలకు ఉచిత ప్రవేశం.. 15 వరకు మాత్రమే ఛాన్స్..
- News
గోదావరి వరదలు: ఏపీలోని 6జిల్లాల్లో హైఅలెర్ట్; నీటమునిగిన 135లంక గ్రామాలు, పరిస్థితి ఇలా!!
- Lifestyle
Bedroom Mistakes: మగాళ్లూ.. బెడ్రూములో ఈ తప్పులు అస్సలే చేయవద్దు
- Technology
iPhone 13 స్మార్ట్‌ఫోన్ పై రూ.26 వేల భారీ డిస్కౌంట్.. ఇది చదవండి!
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
Akhanda 2 కోసం అదిరిపోయే ప్లాన్.. అలా కూడా కలిసి వచ్చేలా సర్వం సిద్దం!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరిలో సీక్వల్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని దర్శకుడు బోయపాటి శ్రీను హింట్ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్ మీద ఇప్పుడు ఆసక్తికర ప్రచారం మొదలైంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

అద్భుతమైన స్పందన
వినయ విధేయ రామ అనే డిజాస్టర్ తర్వాత బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణతో కలిసి అఖండ అనే సినిమా చేశారు. అప్పటికి నందమూరి బాలకృష్ణ చేతిలో కూడా సరిగ్గా ఎలాంటి సినిమా లేకపోవడంతో పాటు చాలా రోజుల నుంచి సరైన హిట్ పడకపోవడంతో ఇద్దరూ ఎంత ప్లాన్ చేసి ఆ సినిమా ఫైనల్ చేశారు. అనుకున్న విధంగానే సినిమా తెరకెక్కించి డిసెంబర్ నెలలో విడుదల చేయడంతో సినిమాకి అద్భుతమైన స్పందన లభించింది.

సినిమాకి సీక్వెల్
అంతేకాక నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించగా ఇతర కీలక పాత్రలో శ్రీకాంత్ వంటి వారు నటించారు. ఈ సినిమా చివరిలో సీక్వల్ తెరకెక్కించే అవకాశం ఉందని హింట్ ఇవ్వడంతో సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాతో కొంచెం పెద్దగానే ప్లాన్ చేయాలని బాలకృష్ణ- బోయపాటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

యాత్ర
2014 ఎన్నికలకు ముందు లెజెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ విజయంలో బాలకృష్ణ కూడా కొంత భాగం పంచుకున్నారని బాలకృష్ణ అభిమానులు భావిస్తూ ఉంటారు. కానీ 2019 ఎన్నికల ముందు మాత్రం ఇలాంటి ఏ ప్రయత్నం జరగలేదు. సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ను ఆధారంగా చేసుకుని యాత్ర అనే సినిమా చేశారు. అది ప్రస్తుత అధికార వైసీపీకి బాగా కలిసి వచ్చింది.

వ్యతిరేకతను వాడుకోవడానికి
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దగ్గరగా ఉండే విధంగా ఒక సినిమా ప్లాన్ చేయాలని బోయపాటి శ్రీను భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎలాగో అఖండ కి మంచి క్రేజ్ లభించింది కాబట్టి దానికి సీక్వెల్ గా ఒక సినిమా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు అనే వాదన వినిపిస్తోంది. నిజానికి 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారానికి సంబంధించి బోయపాటి శ్రీను కీలక బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు తానే తీసుకొని
చంద్రబాబు ప్రచారానికి సంబంధించిన పాటలు, ప్రచార చిత్రాలు వంటి విషయంలో బోయపాటి శ్రీను ముందుండి అన్ని నడిపించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఈసారి కూడా బాధ్యతలు తానే తీసుకొని దానికంటే ముందే ఒక మంచి సినిమా చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ మేరకు ఉందనే విషయం మీద ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక మరో పక్క అధికార వైసీపీ కూడా యాత్ర దర్శకుడితో మరో సినిమా కూడా ప్లాన్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అవుతుందనేది చెప్పలేని పరిస్థితి.