అఖండ 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌‌గా పాన్ ఇండియా స్టార్?.. బాలయ్య ఆ సెంటిమెంట్‌తో..

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సింహా, లెజెండ్, అఖండల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు అఖండ వంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో బాలయ్య కెరీర్‌లోనే పీక్స్‌లో ఉన్నారు. అఖండ 2తో మరో హిట్ అందుకుని డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని నటసింహం పట్టుదలతో ఉన్నారు.

అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akhanda 2 Pre Release Event Allu Arjun is reportedly set to attend the Nandamuri Balakrishna s movie function

అఖండ 2కు రికార్డ్ బిజినెస్?
గతంలో వచ్చిన అఖండ భారీ లాభాలను అందించడంతో ప్రస్తుతం అఖండ 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. షూటింగ్ పూర్తి కాకుండానే అఖండ 2‌కు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అఖండ 2 ఓటీటీ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 80 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపించాయి. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే... సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 55 కోట్ల రూపాయలు, నైజాంలో 36 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మాస్‌ను ఊపేస్తోన్న జాజికాయ సాంగ్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అఖండ 2 యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇటీవల ముంబై ఓ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. అలాగే తాజాగా విడుదల చేసిన జాజికాయ జాజికాయ అనే మాస్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య, సంయుక్తలు వేసిన స్టెప్స్, తమన్ బాణీలు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అందరి కన్ను పడింది. రిలీజ్ మరో 15 రోజుల్లో ఉండటంతో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? చీఫ్ గెస్ట్ ఎవరు? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
దీని ప్రకారం నవంబర్ చివరి వారంలో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుందట. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లు హాజరవుతారట. పుష్ప 2 తొక్కిసలాట ఇన్సిడెంట్ తర్వాత అల్లు కుటుంబానికి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది. అయితే గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డ్ తీసుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య తిరిగి పరిస్ధితులు చక్కబడ్డాయని ఫిలింనగర్ టాక్.

Take a Poll

చీఫ్ గెస్ట్‌గా ఆ పాన్ ఇండియా స్టార్?
ఇక బాలయ్యతో అల్లు అర్జున్ బాండింగ్ కూడా బాగానే ఉంది. అన్‌స్టాపబుల్ షోలో వీరిద్దరి అల్లరి బాగా క్లిక్ అయ్యింది. ఈ క్రమంలోనే అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ హాజరవుతారని అంటున్నారు. అంతేకాదు.. బాలయ్య సెంటిమెంట్‌లని ఎక్కువగా ఫాలో అవుతారని అందరికీ తెలిసిందే. గతంలో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకాగా.. ఆ సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో బన్నీని చీఫ్ గెస్ట్‌గా పిలవాలని బాలయ్య.. అఖండ 2 యూనిట్‌కు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య పిలిస్తే అల్లు అర్జున్ కాదు అనేది ఉండదు. అదే నిజమైతే నందమూరి, అల్లు అభిమానులకు పండగ. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X