Akhanda 2: విడుదలకు ముందు భారీ లీక్.. అఖండ 3 టైటిల్ ఇదేనా?
Akhanda 2: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తాన్ని అఖండ 2 ఫీవర్ కమ్మేసింది. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఫ్యాన్స్ కి పండుగ. అలాంటి కాంబినేషన్‌తో వస్తున్న అఖండ 2 తాండవం (Akhanda 2: Thaandavam) డిసెంబర్ 5న విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈసారి బాలయ్య మరింత రౌద్రంగా, మరింత ఆధ్యాత్మికంగా కనిపిస్తారని టీమ్ చెబుతుండడంతో, అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. విడుదలకు మరికొన్ని గంటల్లో భారీ లీకులు బయటపడ్డాయి. ఇంతకీ ఆ లీక్ ఏంటీ?
అఖండ 2 మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుండటంతో ఫ్యాన్స్ జోష్ పీక్స్ కు చేరింది. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఎనర్జీ, ఆరా వేరే లెవల్. సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ కాంబోలో వస్తున్న మరో మూవీ 'అఖండ 2: తాండవం'. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ డిసెంబర్ 4 నుంచే పేడ్ ప్రీమియర్స్‌తో స్క్రీన్‌పై అడుగుపెట్టబోతుండటంతో హైప్ మరింత పెరిగింది. ఈ సమయంలో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతునందట.

అఖండ యూనివర్స్‌కి మూడో భాగం ఉండొచ్చనే చర్చ గతంలోనే మొదలైంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ ఒక ఇంటర్వ్యూలో "అఖండ మూవీని ఐదు భాగాలుగా చేసినా, బాలయ్య సిద్ధమే. శివుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు' అని చెప్పిన వ్యాఖ్య అభిమానుల పుకార్లు మరింత బలం చేకూర్చాయి. అయితే ఇది కేవలం రూమార్స్ అనుకుంటున్న సమయంలో, తమన్ తాజాగా బోయపాటి, టీమ్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొత్త చర్చకు తెరతీసింది.
ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే? అఖండ 2 మూవీ టీం ఫోటోలో పెద్ద డిజిటల్ స్క్రీన్‌పై పెద్ద అక్షరాల్లో "JAI AKHANDA" అని కనిపించడం అభిమానుల ఊహాగానాలను రెక్కలు తొడిగినట్టు అయింది. గతంలో వచ్చిన రూమర్స్ కు ఇది మరింత బలం చేకూర్చినట్లు అయింది. దీంతో 'అఖండ 3' టైటిల్ 'జై అఖండ' అని ఫ్యాన్స్ వైరల్ చేశారు. 'జై అఖండ... మళ్లీ రౌద్ర తాండవమే!, 'అఖండ 2 రిలీజ్‌కి ముందే పార్ట్ 3 అనౌన్స్‌మెంట్? ఇది సర్‌ప్రైజ్ కాదు... షాక్!' అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మూవీ మేకర్స్ నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా, పరిశ్రమ వర్గాలు 'అఖండ 2' క్లైమాక్స్‌లోనే మూడో భాగానికి హింట్ ఉండవచ్చని చెబుతున్నాయి. బోయపాటి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, పురాణాలు, ఆధ్యాత్మిక శక్తులు వంటి అంశాలు కలగలిపిన అఖండను పవర్ పుల్ గా మార్చాయి. అంతేకాదు, బాలయ్య ఫ్యాన్స్‌కి ఇది ఒక సినిమా కాదు.. ఇదో భావోద్వేగం. అందుకే 'జై అఖండ' అనే టైటిల్ పెట్టారా? అనే సందేహాలు వెల్లువడుతున్నాయి.
ఇప్పటికైతే 'జై అఖండ' టైటిల్ నిజమా కాదా అనేది మేకర్స్ చెప్పే వరకు ఇంత రూమర్స్ వస్తునే ఉంటాయి. మరి నిజంగానే అఖండ-3 ఉందా? ఉంటే టైటిల్ 'జై అఖండ'నా కాదా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అలాగే.. ఇందులో ఎంత నిజముందో చెప్పాలేం కానీ, అఖండ 2 విడుదలకు ముందుకు ఈ ఒక్క లీక్ అభిమానుల్లో ఎనర్జీని డబుల్ చేసింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి జోరు కనిపిస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











