Akhanda OTT రిలీజ్ డేట్.. ఓటీటీలోకి జెట్ స్పీడ్ లో రాబోతున్న బాలయ్య.. ఎప్పుడంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అఖండ సినిమా నిర్మాతలందరినీ ఆనందానికి గురిచేసింది. దర్శకులు సినీ ప్రముఖులు కూడా మళ్లీ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలవుతుంది అనే నమ్మకంతో సంబరాలు చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య కు మరోసారి మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

వరుస అపజయాలు..
నందమూరి బాలకృష్ణ గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత నందమూరి బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జై సింహా ఎన్టీఆర్ బయోపిక్, రూలర్, సినిమలు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.

అఖండ సినిమాతో..
ఇక బాలకృష్ణ డిజాస్టర్ ఎదుర్కొంటున్న ప్రతి సారి కూడా బోయపాటి చేసిన సినిమాతోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచానికి మీరు ప్రశ్న అయితే నాకు సమాధానం అంటూ బోయపాటి మూడోసారి కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందించాడు. సింహా సినిమా లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇక మళ్లీ ఏడేళ్ల తర్వాత వచ్చిన అఖండ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తానికి మాస్ కాంబినేషన్ లో ది బెస్ట్ కాంబో అని నిరూపించారు.

విజిల్స్ వేయించేలా?
అఖండ సినిమా విడుదలైన మొదటి వారం లోనే బాక్సాఫీస్ టార్గెట్ కు అతి దగ్గరలో కి వచ్చేసింది. సినిమా మరో నాలుగు కోట్లు అందుకోగలిగితే బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ఫినిష్ చేసుకున్నట్లే లెక్క. ఈ సినిమా కోసం బోయపాటి శ్రీనివాస్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. బాలకృష్ణ కూడా అఖండ సినిమా కోసం ఫిజికల్ గా చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇక సినిమా వారి కష్టానికి తగ్గట్టుగా థియేటర్స్ లో విజిల్స్ వెయిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేసింది.

ఓటీటీలో ఎప్పుడంటే?
ఇక వెండితెరపై ఈ సినిమాను చూసిన అభిమానులు జై బాలయ్య అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మాస్ థియేటర్స్ లోనే కాకుండా ఏ సెంటర్స్ లో కూడా బాలయ్య అభిమానులు అస్సలు తగ్గడం లేదు. ఇక ఓటీటీలోకి సినిమా ఎప్పుడు వస్తుంది అని సందేహాలు మొదలయ్యాయి. అయితే నెల రోజుల వ్యవధిలోనే డిస్ని హాట్ స్టార్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విడుదలపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











