Akhanda ఫాన్స్ కు గుడ్ న్యూస్.. సీక్వెల్ కూడా రెడీ... కధ ఏంటంటే?

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

సూపర్ హిట్ టాక్

సూపర్ హిట్ టాక్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించగా ఒక పాత్రలో రైతుగా మరో పాత్రలో అఘోరాగా నటించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పూర్ణ, శ్రీకాంత్, నితిన్ మెహ్రా, సుబ్బారావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.

సీక్వెల్

సీక్వెల్

సినిమాలో అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, గెటప్​, థమన్ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ సినిమాకు బాగా హైలైట్​గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​ కూడా తెరకెక్కిస్తారు అంటూ ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు, మూవీ ముగించిన విధానం, అఘోర క్యారెక్టర్​కు ప్రేక్షకులు బాగా కనెక్ట్​ అవ్వడం వంటివి చూస్తే సీక్వెల్​ వస్తుందని ఫ్యాన్స్​ ప్రచారం చేస్తున్నారు.

బాలకృష్ణ కూతురికి మాట

బాలకృష్ణ కూతురికి మాట

ఈ మూవీ క్లైమాక్స్​లో 'ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి' అంటూ అఖండ తన బంధాలన్నిటినీ తెంచుకొని వెళ్లిపోతాడు. కానీ.. వెళ్లే ముందు మాత్రం సినిమాలో తన తమ్ముడు అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. 'నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను' అని చెబుతాడు.

అఖండ సికిందర్ గోరా

అఖండ సికిందర్ గోరా

ఈ క్రమంలో సీక్వెల్ ​ను తెరకెక్కిస్తే.. ఈ మాట ఆధారంగా పాపకు మరో సమస్య రావడం ద్వారా అఖండ మళ్ళీ వెనక్కు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ అంశం మీదనే సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే సీక్వెల్​ ను గనుక తెరకెక్కిస్తే అఖండ సికిందర్ గోరా -(అఘోర) నేపథ్యాన్ని చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

ఎలా పెరిగాడు?

ఎలా పెరిగాడు?

ఎందుకంటే సినిమా మొదలైన వెంటనే రోజుల పసికందుగా ఉన్న బాలకృష్ణ కాశీ చేరతాడు. మరి అక్కడ శివుడు దగ్గరకు చేరిన తరువాత ఎవరి దగ్గర, ఎలా పెరిగాడు? వంటి అంశాలను ఈ సీక్వెల్​లో చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమాలో ఒక అఘోరా బ్యాచ్ మొత్తాన్ని వెంటాడి మరీ చంపినట్లు చూపించారు.

అందుకే అఘోరాలను చంపాడా?

అందుకే అఘోరాలను చంపాడా?

అంతే కాక ఈ సినిమాలో అఘోర -బాలయ్య కర్తవ్యం జీర్ణావస్థలో ఉన్న పాడు బడిన గుడులను బాగుచేయడం అని చెప్పారు, ఆ ఆలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడం వంటివి చూపారు, మరి ఈ క్రమంలో ఆయనకు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అందుకే కొందరు అఘోరాలను చంపాడా? అనేవి సీక్వెల్ లో చూపే అవకాశం ఉంది.

అయితే ఈ సినిమా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కుతుందా? లేక బ్యానర్ మారుతుందా? అనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X