మరోసారి బ్యాడ్ లక్ తో పోరాడుతున్న అఖిల్.. తొలి అడుగులోనే ఏజెంట్‌కు ఎదురుదెబ్బ

అక్కినేని యువ హీరో అఖిల్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చాలానే కష్టపడుతున్నాడు. కానీ ఎలాంటి సినిమా చేసినా కూడా అతనికి కలిసి రావడం లేదు. వరుసగా మూడు సినిమాలు నిరాశపరిచాయి. మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని అఖిల్ చాలా ఆశపడుతున్నాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎవరికి తెలియదు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఇప్పటి వరకు అనుకున్నంతగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఇక అఖిల్ 5వ సినిమా ఏజెంట్ పై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. చూస్తుంటే సినిమా కోసం చాలా కసిగా వర్క్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన రెండవ రోజే ఫ్యాకప్ చేయాల్సి వచ్చింది.

Akhil akkineni agent movie shooting plans cancelled

ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కోసం నెల్లూరు జిల్లా లోని కృష్ణపట్నంకు వెళ్లారు. అయితే అక్కడ షూటింగ్ మొదలైన రెండవ రోజే జోరున వర్షం కురిసింది. వాతావరణం ఏ మాత్రం సహకరించలేదు. ఆ తుఫానుకు ఇప్పట్లో వర్షం తగ్గేలా లేదని చిత్ర యూనిట్ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ కు రెడీ అయినట్లు సమాచారం. ఆ షూటింగ్ క్యాన్సిల్ కావడం వలన కోటి రూపాయలకు పైగా నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చిత్ర యూనిట్ కాస్త నిరాశకు గురైంది. ఇక నెక్స్ట్ మరొక లొకేషన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. ఏజెంట్ సినిమాను దాదాపు 50కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు ట్తెలుస్తోంది. అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక బడ్జెట్ మూవీ. మరి సినిమాతో ఎలాంటి బాక్సాఫీస్ హిట్ అందుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X