అఖిల్ vs అదృష్టం .. కరువులో ఉన్నా దరిద్రం వదిలేలా లేదు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో అక్కినేని హీరో అఖిల్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అఖిల్ తన శక్తినంతా ధార పోస్తున్నాడు గాని వర్కవుట్ అవ్వడం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. నెక్స్ట్ ఈ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాతో రాబోతున్నాడు. బాక్సాఫీస్ కరువులో ఉన్న అఖిల్ ని ఈ సినిమా విషయంలో కూడా దరిద్రం వెంటాడుతోంది.

అఖిల్ vs అదృష్టం.
కష్టపడేవారికి అదృష్టం కూడా కాస్త కలిసి వస్తే ఎలాంటి అడుగులు వేసినా సక్సెస్ అవుతారు. అయితే అఖిల్ అదృష్టం ఏమిటో గాని వచ్చినట్లే వచ్చి దూరమవుతోంది. ఇష్టం వచ్చినట్లుగా అతనితో దోబూచులాడుతోంది. మొదటి సినిమా నుంచి చూసుకుంటే అఖిల్ సినిమాలకు హైప్ బాగానే క్రియేట్ అవుతోంది. కానీ రిలీజ్ తరువాత ఊహించని విధంగా రిజల్ట్ అందుకుంటున్నాయి.

ఆ గాయం ఇంకా మానలేదు..
అఖిల్ మొదటి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఫామ్ లో ఉన్న దర్శకుడు వివి.వినాయక్ అఖిల్ రేంజ్ కి తగ్గట్టుగానే మంచి హైప్ క్రియేట్ చేశాడు. కానీ జనాలు మాత్రం సినిమా చూసిన తరువాత ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోయారు. ఆ డిజాస్టర్ గాయం నుంచి అఖిల్ ఇంకా కొలుకోలేకపోతున్నాడు.

బ్యాడ్ లక్..
హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో అఖిల్ కొత్తగా ఏమి కనిపించలేదు. దీంతో ఆడియెన్స్ ఆ సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఎప్పుడు మోస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విషయంలో కూడా ఈ కుర్ర హీరోను అదృష్టం వెక్కిరిస్తోంది. అసలైతే సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
Recommended Video

ఇప్పుడు కూడా డౌటే..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను లాక్ డౌన్ అనంతరం రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి జనాలు థియేటర్స్ కి వస్తారా లేదా అనే విషయం మిస్టరీగా మారింది. ఇక దసరా సమయంలో రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఆలోచిస్తోంది. కానీ ఆ డేట్ కోసం చాలా సినిమాలు ఎదురుచూస్తున్నాయి. నాని నుంచి మెగాస్టార్ వరకు చాలా మంది ఆ డేట్ రోజు వారి సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ సమయంలో వస్తే.. అఖిల్ సినిమాను రిస్క్ లో పెట్టినట్లే.. మరి నిర్మాతలు అఖిల్ కోసం ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











