అయ్యో పాపం అఖిల్.. ఇంకా గందరగోళం.. అయోమయంలోనే..
అక్కినేని నట వారసుడు అఖిల్ పరిస్థితి ఇంకా గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అఖిల్ చిత్రంతో కోలుకోలేని డిజాస్టర్‌ను చూసిన అఖిల్.. హలో సినిమాతోనైనా కొంత ఊరట కలుగుతుందోమోనని అనుకొన్నాడు. కానీ హలో కూడా ఆశించినంత విజయం సాధించకపోవడంతో మరోసారి అఖిల్ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తున్నది.

తేలని మూడో ప్రాజెక్ట్
హల్ సినిమా తర్వాత అఖిల్ నెక్ట్స్ సినిమా ఏంటో ఇంకా క్లారిటీ లేదు. తన తదుపరి చిత్రం కోసం రకరకాల దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. బోయపాటితో ఓ సినిమా అని అన్నారు. అదీ కూడా గాలివార్తే అని తేలిపోయింది.

తెరపైకి పూరీ, సుకుమార్ పేర్లు
ఆ తర్వాత మూడో సినిమాకు కొరటాలను నాగ్ సెట్ చేశాడనే వార్త ప్రచారమైంది. అదే క్రమంలో పూరీ జగన్నాథ్, సుకుమార్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏదీ కూడా మెటీరీయలైజ్ కాలేదు.

అఖిల్ కోసం వెంకీ
కానీ ఇప్పుడు తొలిప్రేమతో హిట్ కొట్టిన యువదర్శకుడు వెంకీ అట్లూరి పేరు తెరపైకి వచ్చింది. అఖిల్ కోసం వెంకీ ఓ కథను తయారు చేసినట్టు ఓ వార్త వినిపిస్తున్నది. అలాగే బాబీ కూడా ఇటీవల ఓ కథను వినిపించాడట.

బంపర్ హిట్ కోసమే
ఇలా దర్శకుల పేర్లు తెరపైకి రావడమే గానీ అఖిల్ మూడో ప్రాజెక్ట్ వర్కవుట్ కావడం లేదు. యువ హీరోలు వరుస విజయాలతో దూసుకెళ్తుండగా అఖిల్ పరిస్థితే మరీ దయనీయంగా తయారైంది. మూడో ప్రాజెక్ట్‌తో దుమ్మురేపే హిట్‌ను కొట్టడానికి అఖిల్ అన్ని రకాల సిద్ధమవుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











