సక్సెస్ లేని మరో దర్శకుడితో అక్కినేని అఖిల్.. ఈసారైనా సక్సెస్ అందుకుంటాడా?
అక్కినేని యువ హీరో అఖిల్ కెరీర్ మొదటి నుంచి సక్సెస్ కోసం ఏ స్థాయిలో కష్టపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదటి నుంచి ఒక్క సక్సెస్ కూడా లేకపోవడంతో స్టార్ దర్శకులు కూడా అతనితో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. అయితే అఖిల్ మాత్రం సక్సెస్ లేని దర్శకులతో కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాలు ఎలాంటి ఫలితాల్ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయినప్పటికీ అఖిల్ అతను చెప్పిన కాన్సెప్ట్ కి ఏ మాత్రం నో చెప్పకుండా సినిమా చేశాడు. ఇక వీరుపోట్ల అనే దర్శకుడు చెప్పిన మరో కథకు కూడా అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. గతంలో ఈ దర్శకుడు సునీల్ తో ఈడు గోల్డ్ ఎహె అనే సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నాడు.

కెరీర్ మొదట్లో వీరుపోట్ల బిందాస్, రగడ అనే సినిమాలను డైరెక్ట్ చేసి కమర్షియల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందువల్ల నాగార్జున తనయుడు అతనికి మరొక అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. నాగార్జున కూడా వీరుపోట్లతో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు అఖిల్ కోసం అతను ఒక కథ సెట్ చేశాడని తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మారికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











