అక్కినేని వారసుడికి వెంటాడుతున్న సమస్య.. ఇప్పుడైనా సెట్ అయ్యేనా?
అక్కినేని అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా కలసి రావడం లేదు. మొదటి మూడు సినిమాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో నాల్గవ చిత్రంతో అయినా బ్రేక్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. ఈ మేరకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.
అయితే ఈ సినిమా హీరోయిన్ ఇంకా సెట్ కాకపోవడంతో జనాల్లో ఆసక్తి మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి సమయం దగ్గరపడినా హీరోయిన్ విషయంలో క్లారిటీ రాకపోవడం అక్కినేని అభిమానులను కలవరపెడుతోంది. అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్.. మొదట రష్మిక మందన్న, కియారా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్ల పేర్లను పరిశీలించాడు. కానీ ఆ హీరోయిన్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా తాజాగా మరో హీరోయిన్ నివేద పేతురాజ్ ను ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేయాలని నిర్ణయానికి వచ్చాడట బొమ్మరిల్లు భాస్కర్.

ఇటీవలే 'బ్రోచేవారెవరురా' సినిమాతో తన టాలెంట్ చూపించిన నివేతా పేతురాజ్‌ని హీరోయిన్‌గా తీసుకోవడం వల్ల సినిమాకు వెయిటేజ్ పెరుగుతుందని బొమ్మరిల్లు భాస్కర్ భావిస్తున్నాడట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రాబోతున్న కొత్త చిత్రంలో అవకాశం పట్టేసింది నివేద పేతురాజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాలుగో సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమానైనా అఖిల్ కెరీర్ టర్న్ చేస్తుందా! అని ఆశగా చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











