ఆమెనే కావాలంటున్న అక్కినేని వారసుడు.. ఇకనైనా సెట్ అయ్యేనా..?

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ యంగ్ హీరో కెరీర్ గాడిలో పడటం లేదు. మొదటి మూడు సినిమాలు ''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అఖిల్. ఈ మేరకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫేమస్ హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఆ వివరాలు చూస్తే..

హీరోయిన్ పట్ల డైరెక్టర్ స్పెషల్ ఇంట్రెస్ట్

హీరోయిన్ పట్ల డైరెక్టర్ స్పెషల్ ఇంట్రెస్ట్

అఖిల్ కోసం సూపర్ స్క్రిప్ట్ రెడీ చేసిన బొమ్మరిల్లు భాస్కర్.. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు. మొదట రష్మిక మందన్న, కియారా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్ల పేర్లను పరిశీలించాడు. కానీ ఆ హీరోయిన్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా వారిని తీసుకోలేక పోయాడు. ఆ తర్వాత నివేద పేతురాజ్ పేరును కూడా పరిశీలించినట్లు తెలిసింది.

ఆమెనే కావాలంటున్న అక్కినేని వారసుడు

ఆమెనే కావాలంటున్న అక్కినేని వారసుడు

ఇదిలా ఉంటే తాజాగా మరో ఫేమస్ హీరోయిన్ పేరు తెరపైకి రావడంతో అఖిల్ నాలుగో సినిమా విషయమై చర్చలు మొదలయ్యాయి. అందాల భామ పూజా హెగ్డేను తీసుకుంటే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించిన అఖిల్.. ఆమె పేరును ప్రస్తావించాడట. దీంతో చిత్రయూనిట్ పూజా హెగ్డేతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.

భారీ రెమ్మ్యూనరేషన్..

భారీ రెమ్మ్యూనరేషన్..

అయితే పూజా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతుండటంతో భారీ రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో పూజా కోసం చిత్రయూనిట్ ఏకంగా 3. 5 కోట్ల ఆఫర్ ఇచ్చేసిందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో టాక్. అతిత్వరలోనే పూజా ఈ సినిమా సెట్స్ పైకి రానుందని అంటున్నారు.

ఫ్యామిలీ సెంటిమెంట్‌.. క్యాచీ టైటిల్

ఫ్యామిలీ సెంటిమెంట్‌.. క్యాచీ టైటిల్

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు క్యాచీ టైటిల్ కూడా దొరికిందని తెలుస్తోంది. టైటిల్ ప్రకటించిన నాటి నుంచే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ సరికొత్తగా ప్రమోషన్స్ కూడా చేయాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X