ఏజెంట్ విషయంలో మేకర్స్ సంచలన నిర్ణయం.. స్క్రిప్ట్ మార్పు.. ఆ నటుడి ప్లేస్ లో మరొకరు?

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా విషయంలో మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ సహా కొందరు నటులను మారచబోతున్నారు అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

సిసింద్రీతో

సిసింద్రీతో

నాగార్జున సినీ వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొట్టమొదటి సినిమా సిసింద్రీతో సూపర్ హిట్ అందుకున్న అఖిల్ హీరోగా మారాక మాత్రం హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నించారు. సిసింద్రీ తర్వాత అఖిల్ మనం అనే సినిమాలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో పాటు నాగ చైతన్య, నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాలో అఖిల్ కూడా క్లైమాక్స్ లో చిన్న పాత్ర చేశారు.

భారీగా డిజాస్టర్

భారీగా డిజాస్టర్

ఆ సినిమా తర్వాత అఖిల్ 'అఖిల్' అనే సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా కలిసి రాకపోవడంతో సంవత్సరం గ్యాప్ తీసుకుని హలో అనే సినిమా చేశారు. అయితే ఈ సినిమా కూడా హిట్ దక్కించుకోలేకపోయింది. దీంతో మళ్లీ సంవత్సరం గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యింది.

ఏజెంట్

ఏజెంట్

ఇక ఈ దెబ్బతో అఖిల్ సినిమాల ఎంపిక మీద దృష్టి పెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకున్నా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కొంత మేర ఈ సినిమా షూటింగ్ కూడా చేశారు.

రాజీ పడకుండా

రాజీ పడకుండా

తాజా సమాచారం ఏమిటంటే అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే కోవిడ్ కారణంగా ఏజెంట్ షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడిందని

రీషూట్

రీషూట్

అంటున్నారు. దీంతో చిత్ర స్క్రిప్ట్ సహా నటీనటుల ఎంపికను మరింత చక్కగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఈ సమయాన్ని వెచ్చిస్తున్నారు. నివేదికల ప్రకారం, సినిమాలోని కొన్ని సన్నివేశాలు రూపుదిద్దుకున్న తీరుపై మేకర్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ సన్నివేశాలను రీషూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే స్క్రిప్ట్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ చిత్రం విలన్ స్థానంలో మరొక నటుడిని కూడా టీమ్ తీసుకుంటోంది. ఇప్పటికే ఈ సన్నివేశాలు షూట్ జరగగా వాటిని మళ్లీ రీషూట్ చేయనుంది.

Recommended Video

Sankranthi Festival Should've A Movie Like Bangarraju | Tollywood | Filmibeat Telugu
మమ్ముట్టి కీలక పాత్రలో

మమ్ముట్టి కీలక పాత్రలో


అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ బాడీ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాకు మేజర్ హైలైట్ కానుంది. ఏజెంట్‌ విజయంపై మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X