Agent: అఖిల్ 'ఏజెంట్' సినిమాలో భారీ యాక్షన్ సీన్స్.. అన్ని కోట్ల నష్టం.. మళ్లీ రీ షూట్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హ్యాండ్సమ్ అఖిల్ మూవీతో తెరంగేట్రం చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. అప్పటి నుంచి ఎలాగైన మంచి హిట్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేశాడు అఖిల్. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. అఖిల్ లాస్ట్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ హిట్ టాక్ తెచ్చుకున్న అది అంతగా సంతృప్తి పరచలేకపోయింది. ఇప్పుడు ఏజెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. అయితే ఈ సినిమాకు కొన్ని కోట్లు నష్టం జరిగిందని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

 బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో..

అక్కినేని నాగార్జున, శరత్ కుమార్, ఆమని నటించిన సూపర్ హిట్ చిత్రం సిసీంద్రిలో బాబుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అఖిల్. అయితే ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అంతగా గుర్తింపు పొందలేకపోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లు ఇచ్చాయి. కానీ 2021లో చివరిసారిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్​ బ్యాచ్​లర్​ సినిమాతో మొదటిసారిగా హిట్​ ట్రాక్​లో పడ్డాడు.

సిక్స్ ప్యాక్ తో ఏజెంట్ గా..

సిక్స్ ప్యాక్ తో ఏజెంట్ గా..

అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ మూవీ హిట్ అయిన అఖిల్ కు మాత్రం అంతగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ చిత్రంలో అఖిల్​ సరసన హీరోయిన్​గా బుట్టబొమ్మ పూజా హెగ్డేతోపాటు పలువురు హీరోయిన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాతి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు అఖిల్. ఈ క్రమంలోనే ఎలాగైన విజయం సాధించాలని ఏజెంట్ గా రాబోతున్నాడు. ఈ సినిమా కోసం తన బాడీని తెగ కష్టపెట్టాడు. ఫలితంగా ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో అలరించనున్నాడు అఖిల్.

ఏప్రిల్ 28న విడుదల..

ఏప్రిల్ 28న విడుదల..

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న అఖిల్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించడం విశేషం. ఇదివరకు విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టాడు అఖిల్. ముఖ్యంగా మమ్ముట్టి చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక హీరోయన్ గా సాక్షి వైద్య సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఏజెంట్ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే యాక్షన్ సీన్స్ షూట్..

ఇప్పటికే యాక్షన్ సీన్స్ షూట్..

రీసెంట్ గా ప్రోమో ద్వారా ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన షూటింగ్ ఇంకా మిగిలే ఉందట. ఈ సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ కోసం చిత్రబృందం అంతా అరేబియాలో ఉన్న మస్కట్ కు వెళుతున్నారట. అక్కడ 15 రోజులపాటు ఈ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారట. అయితే ఈ యాక్షన్ సీన్స్ ను ఇప్పటికే షూట్ చేశారని సమాచారం. కాకపోతే ఆ సన్నివేశాలు సురేందర్ రెడ్డితోపాటు మిగతా ఎవరికీ నచ్చకపోవడంతో.. మొత్తం పక్కనే పెట్టేసారని టాక్.

మొత్తంగా అన్ని కోట్లు వృథా..

మొత్తంగా అన్ని కోట్లు వృథా..

ఇదివరకు చేసిన ఈ యాక్షన్ సీన్స్ కోసం దాదాపుగా రూ. 3 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఆ మూడు కోట్ల ఖర్చు వృథా అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అదే యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తే ఎంత లేకున్నా మరో రూ. 3 కోట్లు ఖర్చు కానుంది. ఇలా మొత్తంగా 15 రోజుల యాక్షన్ సీన్స్ కోసం రూ. 6 కోట్లు ఖర్చు కానున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అఖిల్ మీద నమ్మకంతో ఇంత ఖర్చు చేస్తున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

పాన్ ఇండియా చిత్రంగా..

పాన్ ఇండియా చిత్రంగా..

ఇప్పటికే అఖిల్ ఏజెంట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ తమీజా సంగీతం అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా విడుదల చేస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X