ఇద్దరు హాట్ హీరోయిన్లతో అక్కినేని హీరో రొమాన్స్.. ఆ కుర్ర తారలు ఎవరంటే?

టాలీవుడ్ సినిమా దగ్గర చాలా మంది హీరోలు మంచి బ్యాక్గ్రౌండ్ లోనే వచ్చినవారు కనిపిస్తారు. కానీ ఇలా వచ్చిన వారు అంతా సక్సెస్ అయ్యిపోయారా అంటే డెఫినెట్ గా లేదనే చెప్పవచ్చు. కాగా ఇలా వచ్చిన స్టార్ హీరోల వారసుల్లో మంచి టాలెంట్ ఉండి సక్సెస్ కానీ హీరోలు అలాగే టాలెంట్ లేకపోయినా నెపోటిజం తో సర్వైవ్ అవుతున్న వారి విషయంలో ఆడియెన్స్ లో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కాగా ఇలా మన తెలుగు సినిమాలో మంచి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చినప్పటికీ సరైన సక్సెస్ లు లేకుండా ఇప్పటికీ ఓ హీరో సినిమా వస్తుంది అంటే మంచి మంచి బిజినెస్ తప్పకుండా జరుపుకునే హీరో ఎవరు అంటే ముమ్మాటికి అక్కినేని యువ హీరో అఖిల్ అని చెప్పవచ్చు.

Akhil Akkineni

అభిమానులు ప్రేమగా అయ్యగారు అని పిలుచుకునే అఖిల్ అక్కినేని విషయంలో అదేంటో కానీ తన మొదటి సినిమా నుంచి సరైన హిట్ లేనప్పటికీ ఇపుడు ఉన్న అక్కినేని హీరోలు అందరికంటే ఎక్కువ మార్కెట్ అండ్ బిజినెస్ లు తన సినిమాలకి జరుగుతాయి. తనకి తగ్గ సినిమా పడట్లేదు కానీ అలా పడితే టైర్ 2 హీరోస్ లో భారీ మార్కెట్ ని తాను సొంతం చేసుకుని ఉండే వాడు.

ఇలా ఇన్నేళ్లు అయినప్పటికీ అఖిల్ నుంచి కొత్త సినిమా సినిమా వస్తుంది అంటే దాని మేనియా బానే కనిపిస్తుంది. కాగా అఖిల్ చివరిగా 2023లో ఏజెంట్ సినిమాలో కనిపించాడు. అక్కడ నుంచి ఇపుడు 2025 వచ్చింది కానీ ఒక్క సినిమా కూడా చేసింది లేదు. కానీ ఇపుడు తాను రావడమే బ్యాంగర్స్ తో రాబోతున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

కాగా అఖిల్ ఇపుడు వరుస మూడు సినిమాలు ఓకే చేస్తే వాటిలో రెండు సినిమాలు ఒకేసారి చేయనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ రెండు సినిమాల్లో అయితే ఇద్దరు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీస్ తో తాను రొమాన్స్ చేయనున్నాడట. కాగా వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర దర్శకుడు మురళీ కిషోర్ తో చేయనున్న సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తుండగా ఆమెతో తాను మొదటిగా రొమాన్స్ చేయనున్నాడు.

ఇక ఈ సినిమా కాకుండా టాలీవుడ్ రీసెంట్ ఎంటర్టైనర్ చిత్రం సామజవరగమనా రచయిత నందుతో ఓ సినిమా ఓకే చేయగా ఇందులో మరో యంగ్ బ్యూటీ ఉప్పెన సెన్సేషన్ కృతి శెట్టి కనిపించనుంది అని తెలుస్తుంది. ఇలా ఈమె కూడా అఖిల్ సరసన కనిపించనుండగా రెండు సినిమాలు షూటింగ్ ఇపుడు ఏకకాలంలోనే చేయనున్నారు.

దీనితో అయ్యగారు మాత్రం ఈ ఇద్దరు యువ హీరోయిన్స్ తో ఒకేసారి రొమాన్స్ చేయనున్నాడని చెప్పాలి. కాగా ఈ సినిమాల్లో ఆల్రెడీ శ్రీలీల సినిమా షూటింగ్ మొదలు కూడా అయినట్టు తెలుస్తుంది. మెల్లగా కృతి సినిమా కూడా స్టార్ట్ అవ్వనుందట. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత మరో కొత్త దర్శకునికి అఖిల్ అక్కినేని ఛాన్స్ ఇచ్చినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Read more about: sreeleela krithi shetty akhil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X