Akhil 6: అఖిల్ కోసం కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ ప్రయోగాలు.. టైటిల్ ఫిక్స్!
అక్కినేని యువ హీరో అఖిల్ ఇటీవల ఏజెంట్ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ అందుకోవడం వలన బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను చూస్తోంది.
ఈ సినిమా పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం కూడా వెనక్కి తీసుకు రాకపోగా నిర్మాతలను ఊహించని నష్టాలకు గురి చేసింది. ముఖ్యంగా అఖిల్ కెరీర్ కు ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.

ఇక ఏజెంట్ సినిమా నుంచి బయటపడేందుకు అఖిల్ తన తదుపరి సినిమాను వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం యూవీ క్రియేషన్స్ తో అతను ఒక సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.
అయితే దర్శకుడు ఎవరు అనే విషయంలో మాత్రం అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక మొత్తానికి ఇటీవల ఇండస్ట్రీ టాక్ ప్రకారం కొత్త దర్శకుడు అనిల్, అఖిల్ 6వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.
ఈ దర్శకుడు ఇంతకుముందు యూవీ క్రియేషన్స్ లో వచ్చిన సాహో రాదేశ్యామ్ సినిమాలకు సహాయక దర్శకుడుగా వర్క్ చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కానీ యూవి క్రియేషన్స్ మాత్రం అనిల్ పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి అఖిల్ 6వ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు 'ధీర' అనే టైటిల్ అనుకుంటున్నారట. కథకు తగ్గట్టుగా ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని దర్శకుడు సూచించడంతో నిర్మాతలు అలాగే అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక యూవి క్రియేషన్స్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ చూస్తాడో లేదో.


Click it and Unblock the Notifications











