అఖిల్ కోసం మరో స్టార్ హీరోయిన్.. ఆ బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందంటే..

అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సక్సెస్ కోసం ఎంతగా తపన పడుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి మూడు సినిమాలు అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు. ఇక తన ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపైనే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

అసలు విషయంలోకి వస్తే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక యాక్షన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే హీరోయిన్స్ విషయంలో అఖిల్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంతవరకు బాక్సాఫీస్ హిట్ లేకపోయినప్పటికీ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పూజ రోల్ గ్లామరస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Akhil akkineni upcoming project latest updates

ఇక సురేందర్ రెడ్డి సినిమాలో కూడా మరో అగ్ర హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న రష్మీక మందన్న అఖిల్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.

హీరోలకు వరుస బాక్సాఫీస్ హిట్స్ అందిస్తున్న రష్మీక అఖిల్ కెరీర్ కు కూడా అలాంటి హిట్ అందిస్తుందో లేదో చూడాలి మరి. ఇక సురేందర్ రెడ్డి సైరా తరువాత అఖిల్ తో చేస్తున్న సినిమా కావున అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. అందుకే సినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X