అఖిల్ అక్కినేని పెళ్లి సంబరాలు.. మ్యారేజ్ డేట్ ఎప్పుడు? వెడ్డింగ్ డెస్టినేషన్ ఎక్కడంటే?
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని ఇంట్లో పెళ్లి భాజాలు మోగేందుకు సిద్దమవుతున్నాయి. ఇటీవల తన కుమారుడు నాగచైతన్య వివాహాన్ని గ్రాండ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తన చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఈ వివాహ కార్యక్రమానికి సంబధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా పెళ్లి డేట్‌ను వెల్లడిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇంతకు అఖిల్ పెళ్లి తేదీ ఎప్పుడు? వేదిక ఎక్కడ అనే వివరాల్లోకి వెళితే..
అక్కినేని ఇంట్లో ఇటీవల నాగచైతన్యతో శోభిత ధూళిపాల వివాహం జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలలో వీరి వివాహం వారి సొంత స్టూడియోల అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించారు. వారి వివాహం తర్వాత శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించి పూజలు నిర్వహించారు. ఓ శుభకార్యం ముగిసిందనుకోగానే.. మరో పెళ్లికి ఫ్యామిలీ సిద్దమైంది.

నాగార్జున, అమల ముద్దుల కుమారుడు అఖిల్ అక్కినేని లవ్ అఫైర్ విషయాన్ని బయటకు వెల్లడించి అభిమానులకు సంతోషకరమైన వార్తను అందించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రావ్డీ కూతురు జైనాబ్ రావ్డీతో ప్రేమ వ్యవహారాన్ని చెప్పి మీడియాకు షాకిచ్చారు. అఖిల్ తన ప్రేమ కథను చాలా సీక్రెట్‌గా కొనసాగించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదిలా ఉండగా, అఖిల్, జైనాబ్ నిశ్చితార్థం వేడుకను కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. నవంబర్ 26వ తేదీ, 2024 రోజున వారి ఎంగేజ్‌మెంట్‌ను భారీగా ప్రైవేట్ కార్యక్రమంగా జరిపించారు. అదే సమయంలో శారి పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేశారనేది సమాచారం. ఇరు కుటుంబాలు మార్చి నెలలోనే వారి వివాహం నిర్వహించడానికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారని తెలిసింది.
అఖిల్ అక్కినేని, జైనాబ్ పెళ్లిని మార్చి మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇరు కుటుంబాలు తీసుకొన్న నిర్ణయం మేరకు మార్చి 24వ తేదీన పెళ్లి ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. అదే రోజు దాదాపు పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయని సన్నిహితులు తెలిపారు.
అయితే అఖిల్ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిపించాలని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంకా ఈ విషయంపై క్లారిటీ లేకపోవడం వల్లనో.. లేదా సీక్రెట్‌గా ఉంచాలనే ఉద్దేశంతో బయటకు వెల్లడించడం లేదని తెలిసింది. అఖిల్ వివాహాన్ని రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, అఖిల్ ఇటీవల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీతో బిజీగా గడిపారు. తన మూవీకి సంబంధించిన పనుల్లో కూడా అఖిల్ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత విరామం తీసుకొని పెళ్లి కోసం సిద్దమవుతున్నారు. త్వరలోనే మ్యారేజ్ డేట్, వేదికను వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











