అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ మూవీ టైటిల్ ఫిక్స్..?

కెరీర్‌లో ఇప్పటి వరకు ఒకే ఒక్క సూపర్ హిట్‌, ఓ హిట్ చిత్రంతో కాలం నెట్టుకొస్తున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఆ పై మెగా ఆఫర్ కొట్టేశాడు. అల్లు అర్జున్‌తో పరుగు అనే సినిమా తీసి హిట్ కొట్టాడు. మళ్లీ మరో హిట్ కొట్టడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడీ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్‌తో ఇంత వరకు హిట్ అనేది తెలియక ప్రయత్నాలు చేస్తూనే ఉన్న కుర్ర హీరో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు.

హిట్ కోసం తపస్సు చేస్తున్న ఈ ఇద్దరు ఓ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా చకచకా రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్‌ను రేపు (ఫిబ్రవరి 4) ప్రకటించబోతోన్నట్టు తెలుస్తోంది.
అయితే కొన్ని నెలల క్రితమే ఈ సినిమా టైటిల్‌పై కొన్ని వార్తలు వినిపించాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నది ఆ టైటిల్. అయితే అప్పట్లో ఇది మరీ పెద్ద టైటిల్ అని ఒకపక్క, విజయ్ దేవర కొండ వరల్డ్ ఫేమస్ లవర్ ను ఇమిటేట్ చేసినట్లు వుంటుంది అని ఇంకో పక్క కామెంట్లు వినిపించాయి.

Akhil And Bommarillu Bhaskar movie Title Is Most Eligible Bachelor

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బయటకు రాబోతున్న టైటిల్ అదేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాచిలర్ అనేది మెయిన్ టైటిల్ అని.. మోస్ట్ ఎలిజిబుల్ అనేవి సబ్ క్యాప్షన్‌గా చిన్నగా రాసి ఉంటుందని.. ఆ ప్రకారంగా పోస్టర్‌ను డిజైన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రతి రోజూ పండగే, అల వైకుంఠపురములో సినిమాలతో సకెస్ బాటలో వున్న గీతా సంస్థకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X