‘అఖిల్’ స్టోరీ లైన్ ... దాన్నుంచే ప్రేరణ?

By Srikanya

హైదరాబాద్ : అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్' . 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 20న విడుదల అయ్యింది. ఈ సందర్బంగా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని చూసిన వారు Assassins Creed Apple Of Eden గుర్తు చేసిందంటున్నారు.

Akhil debut film 'Akhil' : Inspired From Assassin’s Creed Game ?

అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే. నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు.

ఈ సందర్బంగా ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌, థమన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా సినిమా పాటల విడుదల వేడుక గురించి ఒక చిన్న మాట చెప్పాలని మహేష్‌ని అడిగా. వేడుకకి నేనే వస్తా అన్నారు. చాలా సంతోషమనిపించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా. వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.

వి.వి.వినాయక్‌ చెబుతూ ''ఒక సూపర్‌హిట్‌ సినిమా ఇస్తానని నాగార్జునగారికి మాటిచ్చా. ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాం. సినిమా తీసినవాడిగా నేను చెబుతున్నా అఖిల్‌ తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడ''న్నారు.

Akhil debut film 'Akhil' : Inspired From Assassin’s Creed Game ?

యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

Akhil debut film 'Akhil' : Inspired From Assassin’s Creed Game ?

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X