ఇద్దరి అకౌంట్స్ చూసుకుంటున్న అక్కినేని అఖిల్
టాలీవుడ్ క్రికెట్ లీగ్ పునణ్యమా అని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ లైమ్ లోకి వచ్చి సినీ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున అభిమానులంతా అఖిల్ ఎప్పుడు హీరోగా తెరంగ్రేటం చేస్తాడో? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దానికి అప్పుడే తొందరేముంది, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ప్రోత్సహిస్తా అంటున్నారు నాగ్. అయితే అఖిల్ గోల్ మంచి క్రికెట్ కావాలనేదే అని మరికొందరంటున్నారు. అఖిల్ ఏ రంగం వైపు వెళతాడో అనే సంగతి పక్క న పడితే.....అఖిల్ గురించిన ఓ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం అఖిల్ రెండు ట్విట్టర్ అకౌంట్స్ మెయింటెన్ చేస్తున్నాడట. ఒకటి తనది, మరొకటి తాత అక్కినేని నాగేశ్వరరావు. ఆ మధ్య ట్విట్టర్ లో చేరిన నాగేశ్వరరావును చూసి...పాతకాలపు మనిషే అయినా ఈ కాలపు అలవాట్లు ఉన్నాయి, టెక్నాలజీని బాగానే అవపోశన పట్టినట్లు ఉన్నారు అంటూ అంతా ఆశ్చర్యపోరారు. కానీ ట్విట్టర్ అకౌంట్ మెయింటెన్ చేసే కెపాసిటీ అక్కినేనికి లేదని, మనవడే దాన్ని మెయింటెన్ చేస్తుంటాడని తాజా సమాచారం. ఏమైతేనేం? తాత మనవళ్లు ఇంటర్నెట్ తో భలే ఎంజాయ్ చేస్తున్నారు అంటూ చర్చించుకుంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.


Click it and Unblock the Notifications











