అక్కినేని ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మరోసారి వాయిదా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున కుమారుడిగా అడుగు పెట్టాడు హ్యాండ్సమ్ గాయ్ అఖిల్. చిన్న వయసులోనే 'సిసింద్రీ' అనే సినిమాలో మెప్పించిన ఈ కుర్రాడు.. సుదీర్ఘ విరామం తర్వాత 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. దీంతో అఖిల్‌కు సరైన ఎంట్రీ దక్కలేదు. దీని తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాల్లోనూ నటించాడు. కానీ, ఇవి కూడా అతడికి నిరాశనే మిగిల్చాయి. అయినప్పటికీ ఈ యంగ్ హీరో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు.

కెరీర్‌లో మొదటి హిట్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీనిపై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉందట. దీంతో దీన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.

Akhil Most Eligible Bachelor Release Postpone

ఇందులో భాగంగానే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాన్ని అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, ఆ తర్వాత ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడుతుందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పోస్టర్ రిలీజ్ చేసి.. ప్రకటించిన తేదీనే ఇది వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రం మళ్లీ వాయిదా పడబోతుందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూనే ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ వాయిదా పడడం ఖాయమని తెలుస్తోంది. దీన్ని అక్టోబర్ 8న కాకుండా మరో వారం తర్వాత అంటే అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రెండు మూడు రోజుల్లోనే వెల్లడించబోతున్నారనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. దీనిపై అక్కినేని అభిమానులు మాత్రం నిరాశ చెందుతున్నారు.

భారీ బడ్జెట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే చేసింది. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాపై అక్కినేని అఖిల్‌తో పాటు అతడి అభిమానులు బోలెడు నమ్మకాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X