twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్‌కి డైరక్టర్, హీరోయిన్, నిర్మాత ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పుడు అందరీ దృష్టీ అక్కినేని అఖిల్ ఎంట్రీ చిత్రంపై ఉంది. ఏ తరహా చిత్రం చేయబోతున్నాడు...ఏ దర్శకుడు డైరక్ట్ చేస్తాడు..అతని సరసన చేసే హీరోయిన్ ఎవరూ..బ్యానర్ ఏది అనే అంశాలపై ఓ రేంజిలో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం...అఖిల్ తొలి చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించనున్నారు. గతంలో ఆయన బ్యానర్ పై లాంచ్ అయిన హీరోలంతా నెంబర్ వన్ పొజీషన్ లో ఉండటంతో ఈ నిర్ణయం నాగార్జున తీసుకున్నారని తెలుస్తోంది.

    అలాగే అఖిల్ సరసన ఇప్పుడు ఫామ్ లో అలియా భట్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రాలు హిట్ అవుతున్న నేపధ్యంలో ఆమెను తీసుకోవటం ద్వారా బాలీవుడ్ కి కూడా ఈ చిత్రం పంపవచ్చనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇక దర్శకుడు విషయానికి వస్తే ...తన అన్నతో ఆటోనగర్ సూర్య డైరక్ట్ చేస్తున్న దేవకట్టాకే ఈ అవకాశం లభించబోతోందని వినికిడి. ఈ మేరకు దాదాపు సంవత్సరం నుంచి దేవకట్టా..అన్నపూర్ణ స్టూడియోలో తన టీమ్ తో కలిసి స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. అయితే ఆటోనగర్ సూర్య రిజల్ట్ ని బట్టి నిర్ణయం తీసుకుందామని ఇన్నాళ్లూ ఆగారని తెలుస్తోంది.

    Akhil's debut film heroine finalised?

    'మనం'లో తళుక్కున మెరిశాడు అఖిల్‌. ఆయన తెరపై కనిపించిన విధానం అభిమానులకే కాకుండా పరిశ్రమను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు సైతం భవిష్యత్‌లో ఓ మంచి స్టార్‌గా అవతరిస్తాడని అఖిల్‌ని మెచ్చుకొన్నారు. తాజాగా అఖిల్‌ కథానాయకుడిగా తెరంగేట్రం చేయబోయే సినిమాకి సంబంధించి ప్రయత్నాలు వూపందుకొన్నట్టు తెలుస్తోంది. అఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టారు.'తాను ఎలాంటి కథలో నటిస్తే బాగుంటుందో సలహా ఇవ్వండ'ని ట్వీట్‌ చేసి అడిగారు.

    రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని కొందరంటే, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్పటికే అఖిల్‌ రెండు మూడు కథల్ని ఎంపిక చేసుకొన్నారని సమాచారం. ఇంకో ఇరవై రోజుల్లో తాను చేయబోయే చిత్రం గురించి ప్రకటిస్తానని ఇటీవలే చెప్పారు అఖిల్‌. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి సేకరించిన అభిప్రాయాల్ని విశ్లేషించి అతి త్వరలోనే అఖిల్‌ సినిమా ప్రకటించబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

    English summary
    Akhil's debut film will be produced by Ashwini Dutt on Vyjayanthi Movies banner. It is now coming out that Alia Bhatt will be starring opposite Akhil and the film will be directed by Deva Katta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X