»   » కెరీర్, పెళ్లి... అఖిల్ నలిగిపోయాడు పాపం, అందుకే ప్రియురాలితో బ్రేకప్?

కెరీర్, పెళ్లి... అఖిల్ నలిగిపోయాడు పాపం, అందుకే ప్రియురాలితో బ్రేకప్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని అనుభవించినన్ని సుఖాలు, దాంతో పాటు కష్టాలు టాలీవుడ్లో ఇతర ఏ యంగ్ హీరో కూడా అనుభవించి ఉండడు. నూనూగు మీసాల వయసులోనే అఖిల్ తన వయసుకు మించినవి ఎన్నో చూసాడు. చిన్న వయసులోనే అన్ని రకాలుగా ఎంజాయ్ చేసే అవకాశం దొరికినట్లే.... పిన్న వయసులోనే పీకల్లోతు కష్టాల ఊబిలో మునగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.

అఖిల్ వయసు కేవలం 23 సంవత్సరాలు. హీరోగా ఎస్టాబ్లిష్ కాక ముందే ప్రేమవ్యవహారంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వెంటనే పెళ్లికి సిద్ధమై అందరికీ షాకిచ్చాడు. ఇంట్లో వాళ్లు చెప్పినా వినకుండా తెలిసీ తెలియని తనంతో తీసుకున్న నిర్ణయం.... తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

బలవంతం వల్లనే

బలవంతం వల్లనే

జీవికె మనవరాలు శ్రీయ భూపాల్ ను అఖిల్ ప్రేమించడం నిజమే కానీ... అప్పుడే పెళ్లి చేసుకోవాలని మాత్రం నిర్ణయించుకోలేదట. అయితే శ్రీయభూపాల్ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒత్తిడి చేయడం వల్లనే అఖిల్ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

అపుడు వినే పరిస్థితిలో లేడు

అపుడు వినే పరిస్థితిలో లేడు

ఈ వయసులో ప్రేమ ఒకే కానీ... పెళ్లికి మాత్రం అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అయితే అప్పటికి ప్రేమ మైకంలో ఉన్న అఖిల్ వినే పరిస్థితిలో లేడు. అఖిల్ ను బాధ పెట్టడం ఇష్టం లేక నాగార్జున-అమల కూడా ఒకే చెప్పారు. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

పెళ్లి విషయంలో కాస్త ఆగాలనుకున్నారు, కానీ

పెళ్లి విషయంలో కాస్త ఆగాలనుకున్నారు, కానీ

ఎంగేజ్మెంట్ అయిన తర్వాత....శ్రియా భూపాల్ కుటుంబ సభ్యులు నాగ్ ఫ్యామిలీతో చర్చలు జరిపారట. అఖిల్ రెండో సినిమా విడుదలయ్యాక పెళ్లి చేద్దామని నాగ్ చెప్పినా వారు వినిపించుకోలేదని సమాచారం.

నలిగిపోయిన అఖిల్

నలిగిపోయిన అఖిల్

ఈ పరిణామాలతో అటు కెరీర్, ఇటు ప్రియురాలు, మరో వైపు పెళ్లి గొడవలతో అఖిల్ చాలా నలిగిపోయాడని, ఆ ఫ్రస్టేషన్లోనే శ్రీయతో గొడవ పడ్డాడని, చివరకు ఆ గొడవ పెద్దది అయి ఇద్దరి వివాహం రద్దు చేసుకునే వరకు వెళ్లిందని అంటున్నారు.

మరొకరితో శ్రీయ వివాహం

మరొకరితో శ్రీయ వివాహం

అఖిల్, శ్రీయ భూపాల్ వివాహం రద్దు అయిన తర్వాత శ్రీయ భూపాల్ కు ఎన్ఆర్ఐతో వివాహం నిశ్చయమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం ఎంత? అనేది ఇప్పటి వరకు అఫీషియల్ సమాచారం లేదు.

ప్రశాంతంగా ఉన్న అఖిల్

ప్రశాంతంగా ఉన్న అఖిల్

ఒకప్పటిలా అఖిల్ కు ఇపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు. తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే పెట్టాడు. ప్రస్తుతం మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Akhil was eager to marry his girl friend because of her family who wanted to get her married soon. But Akhil and his parents tried to discuss the possiblity of marriage after the release of Akhil's 2nd movie. This resulted in misunderstandings between both the families and the young couple decided to go their separate ways.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu