అఖిల్ మరో బిగ్ మూవీ.. హై బడ్జెట్ తో మళ్ళీ రిస్క్ చేస్తున్నారా?
అక్కినేని యువ హీరో అఖిల్ తాజాగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. 80 కోట్ల బడ్జెట్ తో మూవీ తీస్తే కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. దారుణమైన పరాభవాన్ని ఈ చిత్రంతో అఖిల్ చూసాడు. కష్టం అంతా బూడిదలో పోసినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
డిఫరెంట్ యాక్షన్ కథతో ఈ మూవీ తెరకెక్కుతుందంట. సాహో, రాధేశ్యామ్ చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లోనే సుమారు వంద కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ చేయడానికి రెడీ అవుతుందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

అయితే ఏజెంట్ మూవీ మీద భారీగా పెట్టుబడి పెడితే అందులో సగం కూడా కలెక్షన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ వంద కోట్ల బడ్జెట్ అంటే పెద్ద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. అఖిల్ మీద ఇప్పుడు ఏజెంట్ సినిమాతో బ్యాడ్ సెంటిమెంట్ ముద్ర పడిపోయింది. ఆయన కెరియర్ లో కమర్షియల్ సక్సెస్ అందుకున్న మూవీస్ అంటే ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రమే కనిపిస్తోంది. మిగిలిన సినిమాలు అన్ని కూడా నిర్మాతలని నష్టాలని మిగిలిచాయి.
అలాంటి హీరోపై మళ్ళీ భారీ బడ్జెట్ అంటే కచ్చితంగా రిస్క్ పేస్ చేయడానికి రెడీ అయిపోవాల్సిందే. వంద కోట్ల బడ్జెట్ అనే టాక్ తో పాటు ఇప్పుడు ఈ మూవీకి ధీర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారని ప్రచారం నడుస్తోంది. అలాగే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేసారని టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఏది ఏమైనా కొత్త దర్శకుడు, ఫ్లాప్ హీరోపై వంద కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే ముందే పోగొట్టుకోవడానికి రెడీ అయిపోవాలనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











