వామ్మో...అఖిల్ చాలా స్పీడుగా ఉన్నాడు
హైదరాబాద్: అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో యువ కెరటం అఖిల్. అఖిల్ తన ఎంట్రీ ని హీరోగా ఇవ్వకముందే టైటాన్ వాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడని సమాచారం. స్టార్ హీరో గా ఎదిగాక సాధారణంగా ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్స్ వస్తూంటాయి. అయితే ఈ విషయంలో అఖిల్ చాలా ముందున్నాడు. అతను హీరోగా లాంచ్ కాకముందే స్టార్ హీరోకి రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. దాంతో అతన్ని టైటాన్ వారు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నారని సమాచారం.
ఇక అఖిల్ చిత్రం లాంచింగ్ విషయానికి వస్తే... మరో యంగ్ హీరో నితిన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. వెలిగొండ శ్రీనివాస్ ఇచ్చిన కథ,మాటలుతో ఈ చిత్రం భారీగా రూపొందనుందని అంటున్నారు. వివి వినాయిక్ రీసెంట్ గా అల్లుడు శీను తో నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడుని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయటంతో ఆయనకే అప్ప చెప్పినట్లు సమాచారం.

నాగార్జున ఆ మధ్యన మాట్లాడుతూ... '' 'మనం'లో అఖిల్‌ని ముప్పై సెకన్లపాటు చూపించారు విక్రమ్. అది అభిమానులకు ఎంతగానో నచ్చింది. 'మనం'లో అఖిల్ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.
అలాగే నవ్వుతూ... ''అఖిల్ మరో మహేష్ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు. అఖిల్ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారు.


Click it and Unblock the Notifications











