»   » అనుభవించు రాజా...! అఖిల్ అక్కినేని లవ్ ఎఫైర్లో మరో కోణం!

అనుభవించు రాజా...! అఖిల్ అక్కినేని లవ్ ఎఫైర్లో మరో కోణం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుభవించు రాజా... అనుభవించు రాజా... పుట్టింది పెరిగింది..పుట్టింది పెరిగింది.. ఎందుకూ అందుకే.. అనుభవించు రాజా... అనుభవించు రాజా! తెలుగు సినిమా అభిమానులందరికీ ఈ పాట తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ పాటలాగే కొందరి లైఫ్ అలా ఎజాయ్మెంటుతో సాగిపోతూ ఉంటుంది.

తాజాగా అక్కినేని యంగ్ హీరో అఖిల్ విషయంలో ఈ సాంగ్ పక్కాగా సూటవుతుందంటున్నారంతా....! అఖిల్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో పడ్డ విషయం బయట పెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ అలా ప్రేమ విషయం బయట పెట్టాడో లేదో అతను ప్రేమించిన అమ్మాయి ఎవరనే విషయం కొన్ని గంటల్లోనే లీక్ అయిపోయింది.

శ్రేయా భూపాల్ అనే డిజైనర్ తో అఖిల్ ప్రేమలో పడ్డాడని మీడియాలో వార్తలే వార్తలు. ఒక వేళ ఆ వార్త అబద్దం అయితే అఖిల్ మీడియా ముందుకొచ్చి దాన్ని ఖండించేవాడు.... కానీ అలా జరుగలేదు. దీంతో ఆ వార్తలు నిజమే అని తేలి పోయింది. నాగార్జున కూడా ఈ వార్తలు విని సంతోషం వ్యక్తం చేయడంతో అఖిల్ లవ్ ఎఫైర్ వార్తకు మరింత బలం చేకూరింది.

ఈ ఏడాది డిసెంబర్లో నాగ చైతన్యతో పాటు అఖిల్ వివాహం కూడా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని అఖిల్ స్పష్టం చేసినట్లు సమాచారం.

'తన వయసు కేవలం 22 మాత్రమే, ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవద్దని తల్లిదండ్రులతో పాటు రిలేటివ్స్ అడ్వైజ్ ఇచ్చారు... ముందు తనను తాను సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకోవాలని, అప్పటి వరకు పెళ్లి ఆలోచన లేదు' అని అఖిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

దీన్ని బట్టి అఖిల్ మనసులో....తొలి ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించాలనే ఆలోచన తప్ప మరొకటి లేదనేది విస్పష్టం. ప్రస్తుతం సెలబ్రిటీ సర్కిల్‌లో నడుస్తున్న ట్రెండు కూడా అదే. ఇలాంటి ఎఫైర్లు ఉంటనే లైఫ్‌లో కావాల్సినంత ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. లేకుంటే ఇంత చిన్న వయసులో సంసార సాగరంలోకి దూకి శ్రమ పడటం అవసరమా?.... అనుభవించు అఖిల్..అనుభవించు..!

అఖిల్-శ్రేయ

అఖిల్-శ్రేయ

అఖిల్ అక్కినేని ప్రేమలో పడింది శ్రేయ భూపాల్ అనే యంగ్ గర్ల్ తో అనే ప్రచారం జరుగుతోంది.

స్నేహం..ఆపై ప్రేమ

స్నేహం..ఆపై ప్రేమ

తొలుత శ్రేయతో స్నేహం చేసిన అఖిల్ క్రమక్రమంగా ఆమెతో ప్రేమలో పడ్డాడు.

పేరెంట్స్ ఓకే...

పేరెంట్స్ ఓకే...

నాగ్-అమల కూడా ఒకప్పుడు ప్రేమికులే... అందుకే అఖిల్ ప్రేమకు తల్లిదండ్రుల నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

చైతూ ఇంత ఫాస్ట్ కాదు.

చైతూ ఇంత ఫాస్ట్ కాదు.

లవ్ మ్యాటర్లో నాగ చైతన్య మాత్రం అఖిల్ అంత పాస్ట్ మాత్రం కాదు.

English summary
Earlier, speculation aroused that Akhil is getting married in December. But, it looks like he revealed that, he will not be marrying soon in near future. He said that his age is just 22, his parents and relatives advised him to not to marry now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu