Akhil6: జోరు తగ్గని అఖిల్.. జాన్వీ కపూర్‌తో రొమాన్స్.. ప్రభాస్ హోమ్ బ్యానర్‌లో కొత్త సినిమా!

సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమాతో హీరోగా డెబ్యూ చేసినా అతనికి అనుకున్నంతగా విజయం వరించలేదు. తర్వాత వరుస సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా సాలిడ్ హిట్ కోసం ప్రయత్నించే క్రమంలో ఏజెంట్ (Agent) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది నిరాశపరిచింది. అయినా ఏజెంట్ మూవీ టాక్ పట్టించుకోకుండా మరో సినిమాకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది.

సక్సెస్ ట్రాక్

అఖిల్ సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్ లు చవి చూశాడు అక్కినేని అఖిల్. 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్తా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తర్వాత స్టార్ డమ్ తెచ్చే సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నించాడు ఈ అక్కినేని వారుసుడు. ఈ క్రమంలో వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోవట్లేదని టాక్ వస్తోంది.

akhiljanu

ఊహించని విధంగా

ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ఊహించని విధంగా తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది.

 akhil2

లోపాలు ఉన్నాయి

రెండేళ్లకు పైగా ఏజెంట్ సినిమాను చిత్రీకరించిన అఖిల్, సురేందర్ రెడ్డిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే యాక్షన్ సీక్వెన్స్ లలో మాత్రం అఖిల్ అదరగొట్టాడని అంటున్నారు. ఇక ఈ విషయంపై అక్కినేని అమల స్పందించిన విషయం తెలిసిందే. సినిమాలో లోపాలు ఉన్నాయి కానీ, ఓపెన్ మైండ్ తో చూడాలని ఆమె అన్నారు.

akhil1

కొత్త దర్శకుడితో

ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా సెట్స్ పై ఉండగానే అఖిల్ తన తర్వాతి చిత్రాన్ని లైన్ లో పెట్టాడట. Akhil6 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగులో పెద్ద బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నట్లు జోరుగా టాక్ వినిపిస్తోంది.

akhil-

జాన్వీ కపూర్ తో

అనిల్ కుమార్ గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సాహో చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ అండ్ రైటర్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు అఖిల్ కోసం అద్భుతమైన ఫాంటసీ డ్రామా కథను రెడీ చేశాడట. ఇప్పటికే చర్చలు కూడా ముగిసాయని, అఖిల్ కు సైతం స్టోరీ బాగా నచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని సమాచారం.

akhilakkineni-

ప్రభాస్ హోమ్ బ్యానర్

Akhil6 సినిమాలో మెయిన్ హీరోయిన్ కోసం జాన్వీని సంప్రదించారని, ఆమెకు కూడా కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. ఇక రన్ రాజా రన్ మూవీతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన యూవీ క్రియేషన్స్ తర్వాత ప్రభాస్ హీరోగా సాహో, రాధే శ్యామ్ సినిమాలు కూడా నిర్మించింది. దీన్ని ప్రభాస్ హోమ్ బ్యానర్ అని, ఇందులో డార్లింగ్ పెట్టుబడులు పెట్టారని ఓ టాక్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X