చిరంజీవితో అకీరా నందన్.. పవన్ కొడుకు ఫస్ట్ సినిమాపై గుడ్ న్యూస్!

తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలంగా టాప్ రేంజ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు ముందుగా చెప్పాలి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన సినిమాలతో సందడి చేస్తోన్న ఆయన.. ఇప్పుడు కూడా అదే రీతిలో వరుసగా మూవీలు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

Akira Nandan Special Role In Chiranjeevi Starrer Viswambhara Movie

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలయికలో రూపుదిద్దుకుంటోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఈ ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఇందులో ఎన్నో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలా ఈ సినిమాకు సంబంధించి 80 శాతం టాకీ పార్టును ఇప్పటికే పూర్తి చేసేశారు.

టెక్నికల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకున్నారు. అయితే, ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం మెగా ఫ్యామిలీకి చెందిన ఓ కుర్రాడిని సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. అతడే పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ అని తెలిసింది.

Akira Nandan Special Role In Chiranjeevi Starrer Viswambhara Movie

హై రేంజ్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో అతడి రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. త్వరలోనే ఈ లిటిల్ ప్రిన్స్ షూట్‌లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. 'మనం' సినిమాలో అఖిల్‌ను చూపించినట్లు ఓ సన్నివేశంలో మాత్రం అకీరా కనిపిస్తాడని సమాచారం.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X