‘కెమెరామెన్ గంగతో...’లో పవన్ తనయుడి డాన్స్!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన ఆసక్తికర అంశం ఏమిటంటే....ఈ చిత్రంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో అకీరా తండ్రితో కలిసి ఓ సాంగులో స్టెప్పులు వేసాడని సమాచారం.
ఆ మధ్య తండ్రితో పాటు షూటింగ్ సెట్లోకి వచ్చిన అకీరా నందన్ పై పూరి పట్టుబట్టి ఈ సీన్లు చిత్రీకరించాడని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తనయుడు తొలి సారి తెరపై కనిపించబోతున్నాడనే వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











