Akhil 6: మరో మాస్ దర్శకుడితో అఖిల్ చర్చలు.. సెట్టయితే మామూలుగా ఉండదు..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోలలో అఖిల్ అక్కినేని ఒకరు గత ఏడాది వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. కానీ అఖిల్ రేంజ్ పెంచే విధంగా అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులను సృష్టించలేకపోయింది. అంతకు ముందు వరకు కూడా అఖిల్ ఊహించని విధంగా డిజాస్టర్స్ నీ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న అఖిల్ 6వ సినిమాను మరొక మాస్ దర్శకుడితో కూడా చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
Recommended Video

ఏజెంట్ మూవీ..
మొదటి సినిమా అఖిల్ నుంచి మిస్టర్ మజ్ను వరకు వరుసగా డిజాస్టర్స్ ను ఎదుర్కొన్న సమయంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక ఆ సక్సెస్ ను మరింతగా పెంచుకోవాలని అక్కినేని అఖిల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పై యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

భారీ బడ్జెట్ తో..
సైరా అలాంటి పాన్ ఇండియా సినిమా అనంతరం దర్శకుడు సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాము బడ్జెట్ కూడా భారీగానే కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఇప్పటి వరకు అఖిల్ కెరీర్లో ఎప్పుడూ లేనంత బడ్జెట్ ను లెజెండ్ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా కోసం అఖిల్ సరికొత్త ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు.

అఖండ దర్శకుడితో..
అయితే త్వరలోనే అఖిల్ మరొక మాస్ దర్శకుడితో కూడా సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు కూడా మరెవరో కాదు. అఖండ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను అని తెలుస్తోంది. అఖండ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బోయపాటి ప్రస్తుతం మరొక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అక్కినేని అఖిల్ తో కూడా చర్చ జరిగినట్లు కనిపిస్తోంది.

అంతకంటే ముందుగానే..
బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో కూడా చర్చలు జరుపుతున్నాడు. అయితే అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన బోయపాటి అంతకంటే ముందుగానే అఖిల్ తో సినిమా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అఖిల్ మరో నాలుగు నెలల్లో సురేంధర్ రెడ్డి ఏజెంట్ సినిమా షూట్ ని ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏజెంట్ తరువాత..
అఖిల్ తన 5వ సినిమా ఏజెంట్ ను గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ కు చాలా గ్యాప్ వచ్చింది. ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చాలా వేగంగా ఒక సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఒక మంచి కాన్సెప్ట్ పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











