twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Agent: అఖిల్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా.. ఇక వచ్చేది అప్పుడే?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల్లో అఖిల్ కూడా ఉన్నాడు. ఇక ఈసారి ఎలాగైనా అగ్ర హీరోల స్థానంలో నిలవాలి అని ఏజెంట్ అనే సినిమాతో రాబోతున్నాడు. మాస్ కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉన్నాయి.

    ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమాకు సంబంధించిన విడుదల తేదీ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలకు ఇటీవల ఒక ఆలోచనలకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి పోటీ తీవ్రత ఎక్కువ కావడంతో థియేటర్లు కూడా దొరకడం కష్టమవుతుంది అని నిర్మాతలు దర్శకులు మళ్ళీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

    Akkineni akhil agent movie another postponed plan

    మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో పోటీకి సిద్ధమయ్యాయి. దీనికి తోడు దిల్ రాజు, విజయ్ కాంబినేషన్లో రాబోతున్న వారసుడు సినిమా కూడా చాలా థియేటర్లలో విడుదల కానుంది. ఇక సంక్రాంతికి కఠినమైన పోటీలో ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఏజెంట్ సినిమాకు ధియేటర్లు దొరకడం కాస్త కష్టంగానే ఉంటుంది.

    అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా అన్ని భాషల్లో చేయాలి. తమిళనాడులో విజయ్ వారసుడు సినిమాకు హై రేంజ్ లో డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎవరూ పట్టించుకునే చాన్స్ ఉండదు. అందుకే పెద్దగా పోటీ లేని సమయంలో ఏజెంట్ ను విడుదల చేయాలి అని ఫిక్స్ అయ్యారట. ఫిబ్రవరిలో విడుదల చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో ఏజెంట్ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు.. ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఇంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.

    English summary
    Akkineni akhil agent movie another postponed plan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X