For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అన్న కి జరిగినట్లు కాకూడదనే అఖిల్‌ పాట్లు

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో హీరోగా నిలదొక్కుకోవటం అనేది ఆషామాషీ విషయం కాదు. ఎక్కువ ఛాన్సెలు ఉండటం లేదు. రెండు మూడు సినిమాలు నచ్చకపోతే ఆ హీరోని ప్రక్కన పెట్టేస్తున్నారు. దాంతో తమ తొలి అడుగులు జాగ్రత్తగా వెయ్యాల్సిందే అని నిర్ణయించుకుంటున్నారు వారసలు. అందుకోసం వీలైనంత మేరకు కసరత్తు చేసి,రంగంలోకి దూకి అదృష్టం పరీక్షించుకోవాలి. ఏ జానర్ లో చిత్రం చేయాలి...ఏ సినిమా...ఏ దర్శకుడుతో లాంచ్ అయితే క్రేజ్ ఉంటుంది అనేది రకరకాల లెక్కలతో కూడిన అంశం. అలాంటి డైలమోలో అక్కినేని అఖిల్ ఉన్నారు.

  ముఖ్యంగా తన అన్న నాగచైతన్య...తొలి చిత్రం జోష్ డిజాస్టర్...కావటం మరింత జాగ్రత్తపడేలా చేస్తుంది. ఇప్పటికీ నాగచైతన్య కెరీర్ సరైన దారిలో పడలేదు. ఒడిదుడుకులో నడుస్తోంది. ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్న చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఆటో నగర్ సూర్య చిత్రం అయితే ఏకంగా రిలీజ్ ఆగిపోయింది. ఈ నేపధ్యంలో అఖిల్ ...చాలా జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుందానే నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగా అఖిల్ ... తనను తమ కుటుంబ అభిమానులు ఏ విధంగా చూడాలనుకుంటున్నారనే విషయంకై ట్విట్టర్ ద్వారా అభిప్రాయ సేకరణ మొదలెట్టాడు.

  Akkineni Akhil caught in a dilemma

  అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'లో తళుక్కున మెరిశాడు అఖిల్‌. అతను తెరపై కనిపించిన విధానం అభిమానులకే కాకుండా పరిశ్రమను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. స్టార్ హీరో మహేష్‌బాబు సైతం భవిష్యత్‌లో ఓ మంచి స్టార్‌గా అవతరిస్తాడని అఖిల్‌ని మెచ్చుకొన్నారు. తాజాగా అఖిల్‌ కథానాయకుడిగా తెరంగేట్రం చేయబోయే సినిమాకి సంబంధించి ప్రయత్నాలు వూపందుకొన్నట్టు తెలుస్తోంది. అఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టారు.

  <blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Good morning my twitter buddy's. A favour to ask from all of you ! Please tweet at me what sort of movie you would like to see me in.</p>— Akhil Akkineni (@AkhilAkkineni8) <a href="https://twitter.com/AkhilAkkineni8/statuses/474054289216659456">June 4, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  'తాను ఎలాంటి కథలో నటిస్తే బాగుంటుందో సలహా ఇవ్వండ'ని ట్వీట్‌ చేసి అడిగారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని కొందరంటే, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్పటికే అఖిల్‌ రెండు మూడు కథల్ని ఎంపిక చేసుకొన్నారని సమాచారం. ఇంకో ఇరవై రోజుల్లో తాను చేయబోయే చిత్రం గురించి ప్రకటిస్తానని ఇటీవలే చెప్పారు అఖిల్‌. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి సేకరించిన అభిప్రాయాల్ని విశ్లేషించి అతి త్వరలోనే అఖిల్‌ సినిమా ప్రకటించబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

  English summary
  'A favour to ask from all of you ! Please tweet at me what sort of movie you would like to see me in,' tweeted Akhil.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X