బడ్జెట్ ఎక్కువవుతోందని రెమ్యునరేషన్ వద్దన్న అఖిల్.. ఆ సినిమా కోసమే భారీ వర్కౌట్స్
అక్కినేని యువ హీరో అఖిల్ కి సక్సెల్ రేట్ లేకపోయినా కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. మొదటి సినిమా నుంచి కూడా ఈ హీరో పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. కమర్షియల్ యాంగిల్ లోనే ఆకట్టుకోవలని చూస్తున్నాడు. ముందుగా ఒక బాక్సాఫీస్ హిట్ అందితే ఆ తరువాత ఏదైనా ప్రయోగాత్మకమైన సినిమాను చేయాలని అనుకుంటున్నాడు.
ఇక నెక్స్ట్ ఈ హీరో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు గాని తప్పకుండా కాంబినేషన్ సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖిల్ కూడా దర్శకుడి సలహా మేరకు ఫిట్నెస్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుపటి కంటే ఇంకా ఎక్కువ ఫిజిక్ ని డెవలప్ చేసుకుంటున్నాడు. ఇక సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు 14 రీల్స్ ప్రొడక్షన్ హౌజ్ సిద్ధమైనట్లు సమాచారం.

అయితే ఈ కరోనా కష్టకాలంలో పెద్దగా సక్సెస్ రేటు లేని అఖిల్ పై మార్కెట్ కి మించి బడ్జెట్ కేటాయించడం అంటే రిస్క్ తో కూడుకున్న పని. అయితే ఆ విషయాన్ని ముందే పసిగట్టిన అఖిల్ నిర్మాతల నుంచి రిక్వెస్ట్ రాకముందే ఇప్పుడు రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించవద్దని ముందు సినిమాను పూర్తి చేసిన ఆ తరువాత రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందామని చెప్పాడట. చిన్నవాడైనా అఖిల్ మంచితనానికి నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ అఖిల్ నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సంక్రాంతికి రానున్నట్లు ఇటీవల పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











