అక్కినేని అఖిల్ ఫ్యూచర్ మహేష్ అంటూ ప్రచారం!
నిన్నటి తరం హీరోల విషయానికొస్తే అక్కినేని నాగార్జునే టాలీవుడ్ మన్మధుడు. అఫ్ కోర్స్ ఈ రోజు వరకు కూడా ఆయన గ్లామర్ తగ్గలేదనుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయిలు అతనంటే చాలా ఇష్ట పడతారు. ఇక నేటి తరం యువ హీరోల విషయానికొస్తే అందమైన హీరోల్లో ముందుగా వినిపించేది హీరో మహేష్ బాబు పేరే. దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పినట్లు మహేష్ పక్కన ఎంతటి అందమైన సెక్సీ హీరోయిన్ అయినా ప్రిన్స్ పక్కన కనపడకుండా పోతుందంతే...
మరి రాబోయే రేపటి తరం మహేష్ బాబు ఎవరు? అంటే అక్కినేని వారసుడు అఖిల్ అంటున్నారు అంతా. ఏమిటి? అఖిల్‌ను నాగార్జునతో పోల్చకుండా మహేష్ బాబుతో పోలుస్తున్నారేమిటి? అనుకుంటున్నారా? ఇందుకు ఓ కారణం ఉంది. సీసీఎల్ టోర్నీలో పాలు పంచుకుంటున్న అఖిల్ మహేష్ బాబు మాదిరి గ్లాసెస్ పెట్టి, డ్రెస్ కూడా ఓ సినిమాలో మహేష్ బాబు వేసినట్లు అచ్చం ప్రిన్స్ లా దర్శనం ఇవ్వడమే ఇలాంటి వాదన రావడానికి కారణం.
అయితే అఖిల్ సినిమాల్లోకి వచ్చే విషయం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. సిసిఎల్, సినిమా ఫంక్షన్లలో తరచూ దర్శనం ఇస్తున్నాడు కాబట్టి ఎప్పటికైనా వస్తాడని అక్కినేని అభిమానులు ఆవిస్తున్నారు. అయితే అఖిల్ ను నాగార్జున గ్లామర్ తో పోల్చాలని కోరుతున్నారంతా.


Click it and Unblock the Notifications











