అఖిల్ లెనిన్ కు షాక్.. ఆ విషయంలో అక్కినేని యంగ్ స్టార్ హ్యాట్రిక్!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరిగా అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి మంచి సినిమాలు అందుకుంటారని అభిమానులు ఆశించారు. కానీ లాస్ట్ గా థియేటర్లలోకి వచ్చిన చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్ట్స్ సినిమా లెనిన్ Leninతో తప్పకుండా అలరిస్తారని ఆశిస్తున్నారు. ఆ సినిమాతో అఖిల్ కెరీయర్ టర్న్ తిరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో లెనిన్ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
6 ఏళ్లకు హిట్..
అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లోనూ అఖిల్ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అక్కినేని నాగార్జున తనయుడిగా అప్పటికే నాగ చైతన్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక అఖిల్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారని ఆశించారు. హీరోకు ఉండాల్సిన క్వాలిటీ అన్ని ఉన్నప్పటికీ ఎందుకో అఖిల్ కు కాలం కలిసి రావడం లేదు. తొలుత అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో అలరిస్తూనే వస్తున్నారు. 6 ఏళ్లకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ నిరాశ పరించింది.

లెనిన్ హీరోయిన్ ఛేంజ్ తో..
నెక్ట్స్ అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. పలు పోస్టర్లను కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ఎంపికైంది. తర్వాత ఏమైందో ఏమోగానీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
భాగ్యశ్రీ ఎంట్రీ రీషూట్..
శ్రీలీలాను లెనిన్ చిత్రం నుంచి తప్పించిన తర్వాత మేకర్స్ షూటింగ్ పనులను మరింతగా వేగవంతం చేశారు. అయితే శ్రీలీలాతో ఇప్పటికే తీసిన ఓ 2 వారాల సీన్లను ఇప్పుడు భాగ్యశ్రీతో రీషూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. శ్రీలీలాతో తీసిన సీన్లనన్నింటిని మళ్లీ చిత్రీకరించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో టీమ్ కు మరింత పనిభారం పడనుందని అంటున్నారు.
అఖిల్ ఇది మూడోసారి..
అఖిల్ అక్కినేని హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అఖిల్ నటించిన గత 2 చిత్రాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలు రీషూట్ జరిగాయి. ఇక ఇప్పుడు లెనిన్ చిత్రం కూడా శ్రీలీలా వల్ల రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రీషూట్ విషయంలో అక్కినేని అఖిల్ హ్యాట్రిక్ కొట్టారని అంటున్నారు. ఇదెలా ఉంటే.. అఖిల్ అక్కినేని లెనిన్ తో తప్పకుండా హిట్ కొట్టాలని అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











