నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సంబరాలు జరగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అతి త్వరలోనే అక్కినేని ఇంట్లో పెళ్లి బజాలు మోగనున్నాయని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే..టాలీవుడ్ యంగ్ హీరోలు తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వివాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వరుణ్ తేజ్, శర్వానంద్, నిఖిల్, నితిన్ వంటి యంగ్ హీరోలు పెళ్లి చేసుకున్నారు.తాజాగా అఖిల్ సైతం పెళ్లికి రెడీ అవుతున్నారు.
అఖిల్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తనతో కలిసి ఓ సినిమాలో నటించిన హీరోయిన్‌తో అఖిల్ ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలని అఖిల్ గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం వీరిద్దరూ తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు.

ఈక్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఓకే చేయడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయని తెలుస్తోంది. అటు నాగార్జున సైతం అఖిల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అఖిల్ ప్రేమ వ్యవహారం అన్న నాగ చైతన్యతో పాటు, సమంతకు సైతం కూడా తెలుసనని..వీరిద్దరు అధ్వర్యంలోనే అఖిల్ , ఆ హీరోయిన్ ప్రేమించుకున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ పెళ్లి ఈ ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తోంది.శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది.

ఏం జరిగిందో తెలియదు కానీ అఖిల్‌తో శ్రీయ భూపాల్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమానే యావరేజ్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో సినిమాల నుంచి అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.


Click it and Unblock the Notifications











