అక్కినేని అఖిల్ ఎంట్రీకి హీరోయిన్ ఆమే..?

అఖిల్ ఎంట్రీ గురించి నాగార్జున మాట్లాడుతూ...'నాగ చైతన్య తొలి సినిమాను వేరే నిర్మాత చేతిలో పెట్టి తప్పు చేసాను. నేను నిర్మించే అవకాశం ఉండి చేయలేదు. కానీ అఖిల్ విషయంలో మాత్రం ఆ తప్పు చేయను. నేనే వాడి తొలి సినిమా నిర్మిస్తాను. కథ, దర్శకుడిని ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం వాడికే ఇస్తాను' అని నాగార్జున చెప్పుకొచ్చారు.
ఇక అఖిల్....మనం లో నటిస్తున్నాడంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే నాగార్జున వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు.అప్పుడు...ఇప్పుడూ అదే అంటాను. నటించట్లేదని. అఖిల్ నటించట్లేదని నేనే స్వయంగా చెప్పినా గాసిప్స్ ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదు. అఖిల్‌ని వచ్చే ఏడాది పరిచయం చేస్తాం. డైరక్టర్ ఎవరు? ఏమిటి?.. ఆ విశేషాలన్నీ సవివరంగా వెల్లడిస్తాం. 'మనం'లో మాత్రం అఖిల్ నటించట్లేదు అని మరోసారి నాగార్జున అఖిల్ ఎంట్రీ గురించి..మనం లో నటించే విషయం గురించి మీడియాకు తేల్చి చెప్పారు.'మనం' చిత్రంలో అఖిల్ నటించరని గతంలో మీరన్నారు. కానీ నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడేమంటారు? అని మీడియావారు ప్రశ్నిస్తే ఇలా స్పందించారు.
ఇక నాగార్జున కూడా 'ఉయ్యాల జంపాల' చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. నాగార్జున మాట్లాడుతూ...'ఉయ్యాల జంపాల' నాకెంతో ఆనందానుభూతుల్ని పంచింది. దాన్ని ఇమేజ్‌లేని తారలతో చెయ్యాలని కొత్తవాళ్లతో చేశాం. సురేశ్ మంచి థియేటర్లు ఇచ్చాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో తయారైంది కాబట్టి నా అభిప్రాయంలో ఇది ఈ ఏడాదిలోనే అతిపెద్ద హిట్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇలాంటి సినిమాలు చెయ్యాలనే కోరిక ఉంది. రోజూ ఐదారుగురు స్కిప్టులు చెబుతామంటూ ఫోన్లు చేస్తున్నారు అన్నారు.


Click it and Unblock the Notifications











