'ఆ' సినిమాలు అచ్చిరావని అఖిల్ ఫిక్సయ్యాడా...అందుకే ఇలా!

అక్కినేని హీరోలలో అఖిల్ దారి వేరు. మొదటి సినిమాతోనే భారీ బడ్జెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన నాలుగో సినిమా రిలీజ్ చేసిన స్టార్ హీరో అనిపించుకో లేక పోతున్నాడు. కథల పుణ్యమో మరి ఏమిటో తెలియదు కానీ ఈయనకు ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గది దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి అక్కినేని కుటుంబం అంటే లవ్ స్టోరీ లకు పెట్టింది పేరు.

అక్కినేని నాగేశ్వరరావు మొదలు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య దాకా ఈ జానర్లో హిట్ కొట్టిన వారే. కానీ అదేమిటో తెలియదు కానీ అఖిల్ ఇప్పటికే నాలుగు సినిమాలు చేసినా ఒక ప్రేమ కథ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు.

కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ వైరల్ ఫోటోలు..

విభిన్నమైన సినిమాలు చేసే ఆలోచనలో

విభిన్నమైన సినిమాలు చేసే ఆలోచనలో

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక రకంగా లవ్ స్టోరీ అనే చెప్పాలి. అంతేకాక అక్కినేని అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కికూడా ఈ సినిమా హిట్ కావడం ఎంతో ముఖ్యం. అయితే తనను ప్రేక్షకులు లవర్ బాయ్ గా చూడడానికి ఇష్టపడటం లేదని తెలుసుకున్నాడో ఏమో తెలియదు కానీ అఖిల్ ఇప్పుడు వరుసగా విభిన్నమైన సినిమాలు చేసే ఆలోచన చేస్తున్నారు.

బిల్డింగ్ మీద దృష్టి

బిల్డింగ్ మీద దృష్టి

ఇప్పటికే ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా కమిట్ అయ్యాడు. గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ మీద కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కూడా గోవాలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా అఖిల్ మరో సినిమా ఒప్పుకున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.

కావాలనే విభిన్నమైన కథలు

కావాలనే విభిన్నమైన కథలు

దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అఖిల్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తోందని అంటున్నారు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నాడని దానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం చేయనుందని ప్రచారం జరుగుతోంది. అయితే తనకు లవర్ బాయ్ ఇమేజ్ కలిసి రావడం లేదని భావిస్తున్న అఖిల్ స్వయంగా ఇలా విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నాడు అని అంటున్నారు.

Recommended Video

ఇందుకే కదా Akkineni Samantha లేడీ సూపర్ స్టార్ అయింది !
హిట్ కొట్టాలనే ఇలా

హిట్ కొట్టాలనే ఇలా

తను జనానికి లవ్ స్టోరీ చేయడనం నచ్చకపోతే వారికి నచ్చేలా తాను యాక్షన్ జానర్లోకి లేదా మాస్ జానర్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంన్నాడని అంటున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అజయ్ భూపతితో ఒక మాస్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. కధ కూడా చివరిదాకా వచ్చిందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితే కానీ అది నిజమని నమ్మలేము. అఖిల్ ఎలా అయినా హిట్ కొట్టాలని ఇలా వేరు వేరు జోనర్ కథలు ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X