Agent: అక్కినేని అఖిల్ బిగ్ బడ్జెట్ మూవీ.. న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్?

అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. మొదటి నుంచి కూడా ఒక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అందుకోవాలి అని అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అతను ఎంత ప్రయత్నం చేసినా కూడా మాస్ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చివరగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఓ మోస్తరుగా బాగానే ఆడింది. కానీ అఖిల్ రేంజ్ ను పెంచే స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది.

ఇక ప్రస్తుతం అయితే అతని ఫోకస్ మొత్తం కూడా ఏజెంట్ సినిమాపైనే ఉంది. మొదటి సారి అతనికి ఒక పవర్ఫుల్ దర్శకుడు కూడా దొరికాడని చెప్పవచ్చు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఫిబ్రవరిలో రావాల్సిన ఆ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఆగస్టు నెలలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పనులు ఇంకా చాలా వరకు మిగిలిపోయి ఉండడంతో మరొక కొత్త డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

akkineni akhil upcoming movie agent new release date update

కుదిరితే దసరా సమయంలో ఆయన ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. కానీ అప్పుడు బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా విడుదలకు పోటీపడుతున్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు కూడా దసరా బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏజెంట్ సినిమాను అక్టోబరు మొదటి వారంలో విడుదల చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ పనులు అయితే తుది దశకు చేరుకుంటున్నాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కోసం ఎక్కువ సమయం పడుతుందట. అఖిల్ ఏజెంట్ సినిమాలో ఒక సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో అలాగే మరికొన్ని దేశాల్లో అతను చేసే పోరాట విన్యాసాలు కూడా అద్భుతంగా ఉంటాయట. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అఖిల్ కెరీర్లోనే ఈ సినిమా కోసం అత్యధిక బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. మరి ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X