అఖిల్ సినిమాపై నాగార్జున నమ్మకం.. కానీ హిట్టు కొట్టడం కష్టమే?
సినిమా ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని రూల్ ఏమి లేదు. టాలెంట్ ఉన్నవారే ఎక్కడైనా సక్సెస్ అవుతారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా పోటీ ప్రపంచంలో జనాలను ఆకర్షించాలి అంటే.. ఏదైనా సరే.. అంతకు మించి అనేలా ఉండాలి. ఎలాంటి సపోర్ట్ లేకపోయినా విజయాల్ని అందుకున్నవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే అక్కినేని వారసుడు మాత్రం ఎంత కష్టపడుతున్నా సక్సెస్ అవ్వడం లేదు.
నాగ చైతన్య కూడా కెరీర్ మొదటి అడుగులో కాస్త తడబడ్డాడు కానీ అఖిల్ రేంజ్ లో అయితే ఇబ్బంది పడలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో రానున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఆ సినిమాపై ఇటీవల నాగార్జున ఒక లుక్కేశారట. ఫస్ట్ ఆఫ్ చాలా బావుందని సెకండ్ హాఫ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉందని అన్నారట.

అయితే హలో సినిమా విషయంలో కూడా నాగార్జున ఇలాగే ఫీలయ్యారు. కానీ ఆ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ అయ్యింది లేదు. మిస్టర్ మజ్ను కూడా సక్సెస్ అవుతుంది అనుకున్నారు కానీ అఖిల్ రొటీన్ గానే కనిపిస్తున్నాడు అని జనాలు పెదవి విరిచారు. దీంతో నెక్స్ట్ సినిమాతో అయినా లుక్కులో మార్పులు చెస్తాడు అనుకుంటే మళ్ళీ అదే తరహాలో లవర్ బాయ్ మాదిరిగా దర్శనమిచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఎంత బాగా డీల్ చేసినా కూడా హీరోపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుంటే కష్టమంతా వృధా అవుతుంది. మరి జనాలకు నచ్చేలా ప్రమోషన్స్ తో అఖిల్ తన కొత్త టాలెంట్ ఏమైనా చూపిస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











