అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగార్జున, చైతూ అలా కనిపించనున్నారా?

టాలీవుడ్ యువసామ్రాట్ నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్తోంది. వరుసగా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ తన ఇమేజ్‌ను కొత్తగా మలుచుకుంటున్నారు. ఇటీవల తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. వృషకర్మ సినిమాతో బిజీబిజీగా మారారు. తాజాగా మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఒకటి తండ్రి నాగార్జునతో కలిసి చేసే మల్టీస్టారర్ కాగా, మరొకటి తన 25వ మైల్‌స్టోన్ మూవీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌కు మరోసారి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ స్పెషల్ ట్రీట్ ఏంటీ?

నాగ చైతన్య లైనప్‌లో ఉన్న ప్రాజెక్టులు చూస్తే మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని జానర్లను టచ్ చేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా..టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. నాగ చైతన్య మరోసారి తన తండ్రి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేయబోతున్నాడట. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్న కొత్త సినిమాలో ఈ తండ్రీ-కొడుకుల కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, బంగారురాజు సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ జోడీ, మరోసారి వెండితెరపై కనిపిస్తే అభిమానులకు అది నిజంగా డబుల్ ట్రీట్‌గా మారుతుంది.

Akkineni Double Treat Nagarjuna-Chaitanya Combo Buzz King100 Movie Update

సమాచారం ప్రకారం.. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో చైతన్య పాత్ర చిన్నదైనా ప్రభావవంతంగా ఉండబోతుందట. కథలో కీలక మలుపు తిరిగే పాత్రగా ఆయన కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన ఈ సినిమా కూడా గత సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఇదే సమయంలో, చైతూ తన కెరీర్‌లో 25వ చిత్రంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బెదురులంక 2012తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్లాక్స్‌తో ఈ మైల్స్‌టోన్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుతం చైతూ లైనప్‌ను గమనిస్తే, ఆయన ప్రతి సినిమాతో ఒక కొత్త జానర్‌ను టచ్ చేస్తున్నట్టు గుర్తించారు.

మరోవైపు.. కింగ్ నాగార్జున తన 100వ ప్రతిష్టాత్మక సినిమాతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. 'కింగ్ 100'అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున స్వయంగా ఈ సినిమా ప్రస్తుతం సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికీ అధికారిక ప్రకటన లేకపోయినా.. సినిమా గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా దర్శకుడు రా.కార్తీక్ షూటింగ్ వేగంగా జరుగుతోందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలిసింది. ఈ మూవీలో నాగార్జున స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని, శివ, రక్షకుడు, కూలీ సినిమాల తరహాలో క్లాసిక్ & డిఫరెంట్ గెటప్స్‌లో మెప్పిస్తారని చెప్పారు. కొత్త దర్శకుడిని ఎంపిక చేయడంపై వచ్చిన సందేహాలకు సమాధానంగా.. కథపై నమ్మకంతోనే నాగ్ ఈ ఛాన్స్ ఇచ్చారని దర్శకుడు స్పష్టం చేశారు. మొత్తానికి 'కింగ్ 100'పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X